AC Car : ఏసీ కారులో బెంజీన్ వాయువు… ప్రమాదకరమేనా…

కారును స్టార్ట్ చేసే ముందు చాలా మంది అనేక రకాల పొరపాట్లు చేస్తుంటారు. ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే ఏసీని ఆన్ చేస్తుంటారు.

AC Car : ఏసీ కారులో బెంజీన్ వాయువు… ప్రమాదకరమేనా…

Car Ac

AC Car : కారు సౌకర్యవంతమైన వాహనంగా మారిపోయింది. ఇటీవలికాలంలో చాలా మంది కారులో ప్రయాణం వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో కొత్త కార్లతోపాటు, సెకెండ్ హ్యాండ్ కార్లు రీజనబుల్ ధరల్లో లభిస్తుండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలు చేసే అన్ని కార్లలో ఏసి తప్పనిసరిగా ఉంటుంది. ఏసీ కారులో ప్రయాణించేందుకు ఎక్కవ మంది మొగ్గు చూపుతారు. ఏసీ కారులో ప్రయాణించేవారు కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కారును స్టార్ట్ చేసే ముందు చాలా మంది అనేక రకాల పొరపాట్లు చేస్తుంటారు. ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే ఏసీని ఆన్ చేస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మనం కారును పార్క్ చేసి ఉంచినప్పుడు అద్దాలని మూసివేసి ఉంచుతాం. ఆసమయంలో కారులో బెంజీన్ వాయువులు ఉత్పత్తి అవుతాయి. నీడలో పార్క్ చేసిన సమయంలో బెంజీన్ వాయువుల ఉత్పత్తి 400 నుండి 800 మిల్లీ గ్రాముల పరిమాణంలో ఉంటుంది. అదే ఎండలో పార్క్ చేస్తే 2000 నుండి 4000 మిల్లీ గ్రాముల బెంజీన్ వాయులు ఉత్పత్తి అవుతాయి. ఎండలో ఉంచిన కారులో బెంజీన్ వాయువుల ఉత్పత్తి అధికంగా ఉంటుంది అన్నమాట.

మనం బయటకు వెళ్ళాలని కారును తీసే సమయంలో అందులోకి ఎక్కిన తరువాత లోపల ఉన్న బెంజీన్ వాయువుని పీల్చుకుంటాం. కారులోకి ఎక్కిన వెంటనే అద్దాలు దింపాలన్న కండీషన్ ఉన్నప్పటికీ చాలా మంది ఆ నియమాన్ని పాటించరు. దీనికి తోడు అద్దాలు వేసే ఉంచి ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే ఏసిని ఆన్ చేస్తారు. ఏసీని ఆన్ చేసిన సమయంలో అందులో నుండి ఒక్కసారిగా కొద్ది మొత్తంలో వేడిగాలి బయటకు వస్తుంది. ఆగాలిలో అధిక మొత్తంలో బెంజీన్ విడుదలవుతుంది.

అలా విడుదలైన బెంజీన్ ను పీల్చటం వల్ల శరీరంలోని అవయవాలపై దుష్రభావాన్ని చూపిస్తుంది. కాలేయంతోపాటు, ఎముకల కణజాలం, మూత్రపిండాలపై వత్తిడి కలిగిస్తుంది. దీనికితోడు ఏసీ ఆన్ చేసిన సమయంలో విడుదలయ్యే గాలిలో కాన్సర్ వ్యాధిని కలిగించే క్రిములు ఉంటాయి. భవిష్యత్తులో కాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయి.

కారు ఉన్న ప్రతిఒక్కరు తప్పనిసరిగా కారు ఎక్కిన వెంటనే కొద్ది సేపు అద్దాలు దించి ఉంచటం ఉత్తమం.. దీని వల్ల కారు నిలిపి ఉన్న సమయంలో లోపల ఏర్పడే బెంజీన్ వాయువులు బయటకు వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది. అద్దాలు దించిన తరువాత ఏసీ ఆన్ చేసుకోవటం మంచిది. ఏసీ ఆన్ చేసిన సమయంలో విడుదలయ్యే బెంజీన్ వాయువు సైతం బయటకు వెళ్ళిపోతుంది. తప్పనిసరిగా ఈ నియమాలను పాటిస్తే ఆరోగ్యానికి మేలుజరుగుతుంది.