Bharat Biotech: నాజల్ వ్యాక్సిన్ ట్రయల్స్ చేసుకున్న భారత్ బయోటెక్

కరోనా వ్యాక్సిన్ అంటే సూది మందు (ఇంజెక్షన్ ) మాత్రమే కాదు. ఇకపై నాజల్ వ్యాక్సిన్ కూడా వచ్చేస్తుంది. దీనిని కొద్ది రోజుల ముందే డెవలప్ చేసినప్పటికీ రీసెంట్ గా అప్రూవల్ దక్కించుకుంది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డా. కృష్ణ ఎల్లా వెల్లడించారు.

Bharat Biotech: నాజల్ వ్యాక్సిన్ ట్రయల్స్ చేసుకున్న భారత్ బయోటెక్

Bharath Biotech

 

Bharat Biotech: కరోనా వ్యాక్సిన్ అంటే సూది మందు (ఇంజెక్షన్ ) మాత్రమే కాదు. ఇకపై నాజల్ వ్యాక్సిన్ కూడా వచ్చేస్తుంది. దీనిని కొద్ది రోజుల ముందే డెవలప్ చేసినప్పటికీ రీసెంట్ గా అప్రూవల్ దక్కించుకుంది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డా. కృష్ణ ఎల్లా వెల్లడించారు.

“డేటా విశ్లేషణ కొనసాగుతుంది. రెగ్యూలేటరీ ఏజెన్సీకి డేటా సబ్‌మిట్ చేస్తాం. అంతా ఓకే అయితే పర్మిషన్ తీసుకుని ప్రపంచంలోనే తొలి నాజల్ వ్యాక్సిన్ ను లాంచ్ చేస్తాం” అని పేర్కొన్నారు.

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ భారత్ బయోటెక్‌కు ఫేజ్ 3 బూస్టర్ డోస్ అప్రూవల్ దక్కించుకుంది. ఇండియాలో జరుగుతున్న తొలి ప్రయోగమిది.

Read Also: బూస్టర్ డోసుగా భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ పై ట్రయల్స్ షురూ

భారత్ బయోటెక్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. “ఇంట్రానాజల్ వ్యాక్సిన్ చాలా మంచి ఇమ్యూన్ రెస్పాన్స్ సంపాదించింది. IgAను న్యూట్రలైజ్, మ్యూకోజల్ IgA, Tకణాల వల్ల ఇమ్యూన్ రెస్పాన్స్ పెరిగి ఇన్ఫెక్షన్ ను అడ్డుకుంటుంది. ఫలితంగా కొవిడ్-19 ఇన్ఫెక్షన్, ట్రాన్స్‌మిషన్ ను బ్లాక్ చేస్తుంది” అని వెల్లడించారు.

ఇండియాలో థర్డ్ డోస్ కోసం ఫేజ్-3కి అప్లికేషన్ సబ్ మిట్ చేసిన రెండో కంపెనీ భారత్ బయోటెక్. ఈ నాజల్ వ్యాక్సిన్ కొత్ కరోనా కొవిడ్ వేరియంట్ల ట్రాన్స్‌మిషన్ కాకుండా అడ్డుకుంటుంది.