Bharat Jodo Yatra: విభ‌జ‌న రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా 3,500 కి.మీ పాదయాత్ర: దిగ్విజ‌య్ సింగ్

క‌న్యాకుమారి నుంచి కశ్మీర్ వ‌ర‌కు కాంగ్రెస్ చేయ‌నున్న భారత్‌ జోడో యాత్ర (సమైక్య భారత యాత్ర)ను విజ‌య‌వంతం చేసేందుకు ఆ పార్టీ నేత‌లు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నారు. ఇదే విష‌యంపై న్యూఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ ముఖ్య‌ నేత‌లు స‌మావేశ‌మై చ‌ర్చించారు. అనంత‌రం కాంగ్రెస్ నేత‌ దిగ్విజ‌య్ సింగ్ మాట్లాడుతూ.. అక్టోబ‌ర్ 2 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు.

Bharat Jodo Yatra: విభ‌జ‌న రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా 3,500 కి.మీ పాదయాత్ర: దిగ్విజ‌య్ సింగ్

Digvijay Singh

Bharat Jodo Yatra: క‌న్యాకుమారి నుంచి కశ్మీర్ వ‌ర‌కు కాంగ్రెస్ చేయ‌నున్న భారత్‌ జోడో యాత్ర (సమైక్య భారత యాత్ర)ను విజ‌య‌వంతం చేసేందుకు ఆ పార్టీ నేత‌లు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నారు. ఇదే విష‌యంపై న్యూఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ ముఖ్య‌ నేత‌లు స‌మావేశ‌మై చ‌ర్చించారు. అనంత‌రం కాంగ్రెస్ నేత‌ దిగ్విజ‌య్ సింగ్ మాట్లాడుతూ.. అక్టోబ‌ర్ 2 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర కొన‌సాగుతుందన్నారు.

Dalai Lama: నేను చైనా నుంచి స్వాతంత్ర్యాన్ని అడ‌గ‌ట్లేదు: ద‌లైలామా

ఎన్డీఏ విభ‌జ‌న రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా 3,500 కిలోమీట‌ర్ల పాటు కాంగ్రెస్ నేతల పాదయాత్ర జ‌రుగుతుందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. నిరుద్యోగులు, రైతులు, బ‌ల‌హీన వ‌ర్గాల ప‌క్షాన యాత్ర ఉంటుందని చెప్పారు. రాజ్యాంగ సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం దుర్వినియోగం చేస్తోంద‌ని విమ‌ర్శించారు.