Pyari Choudhary : ‘ఆడపిల్లల స్మశానం’లో అరుదైన ఘనత సాధించిన యువతి..ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు

అది భారత్-పాకిస్తాన్ సరిహద్దు దగ్గర ఉన్న బార్మర్ జిల్లాలోని అతి చిన్న రౌజీ అనే గ్రామం. ఆ గ్రామాన్ని ‘ఆడపిల్లల స్మశానం’ అని పిలిచేవారు. అటువంటిది ఓ అమ్మాయి తన సొంత ఊరు అయిన బాడ్మారాకు వచ్చింది. తన కోసం మేళతాళాలతో..ఆనందానికి సంకేతమైన రంగులు, పూలు చల్లుతు ఆమెకు ఘన స్వాగతం పలకటం చూసి సంతోషపడిపోయింది.

Pyari Choudhary : ‘ఆడపిల్లల స్మశానం’లో అరుదైన ఘనత సాధించిన యువతి..ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు

Daughter Became A Lieutenant..girl Receives Heartfelt Welcome (1)

Bharath-Pak Border district’s daughter became a lieutenant: అది భారత్-పాకిస్తాన్ సరిహద్దు దగ్గర ఉన్న బార్మర్ జిల్లాలోని అతి చిన్న గ్రామం అయిన రౌజీ అనే గ్రామం. ఆ గ్రామాన్ని ‘ఆడపిల్లల స్మశానం’ అని పిలిచేవారు. అటువంటిది ఓ అమ్మాయి తన సొంత ఊరు అయిన బాడ్మారాకు వచ్చింది. బస్సు దిగింది. అంతే షాక్ అయ్యింది. తమ ఊరివారంతా తన కోసం చేసిన ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయింది. కారణం తమ గ్రామాన్ని గతంలో ‘ఆడపిల్లల స్మశానం’ అని పిలిచేవారనే విషయం ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. తన కోసం మేళతాళాలతో..ఆనందానికి సంకేతమైన రంగులు, పూలు చల్లుతు ఆమెకు ఘన స్వాగతం పలకటం చూసి సంతోషపడిపోయింది. అంతేకాదు ఆమె మెడలో పూలదండలు వేసి రా బిడ్డా రా నువ్వు మా గ్రామానికే పేరు తెచ్చావు. ఒకప్పుడు ‘ఆడపిల్లల స్మశానం’ అని పిలిచే మన ఊరి పేరుకు ప్రతిష్టలు తెచ్చావంటూ తెగ ప్రశంసిస్తూ ఘన స్వాగతం పలికారు.ఇంతకీ ఆ యువతి ఎవరు?ఎందుకు గ్రామస్తులంతా ఆమెను అంత ఘనంగా స్వాగతిస్తూ గ్రామంలోకి ఆహ్వానించారో తెలుసుకుందాం..

భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉండే బాడ్మేర్ లోని రౌడీ గ్రామానికి చెందిన ఆ అమ్మాయి పేరు ప్యారీ చౌదరీ. ఆమె తండ్రి కిస్తూరా రామ్..కిస్తూరా రామ్ గతంలో భారత్ ఆర్మీలో 47 ఆర్మీ రెజిమెంట్‌లో సుబేదార్‌గా రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఆ సుబేదార్ కుమార్తె ప్యారీ..మెడికల్ విభాగంలో లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం సాధించింది. ఆ గ్రామంలో ఆ స్థాయి ఉద్యోగం సాధించిన మొదటి అమ్మాయి ప్యారీ.
దీంతో తమ ఊరుకు పేరు తీసుకొచ్చిన ప్యారీ చౌదరిని చూసి ఆ ఊరంతా గర్వంతో ఉప్పొంగిపోతోంది. ఊరు ఊరంతా సంబరాలు చేసుకుంటూ ఆమెకు ఘన స్వాగతం పలికింది. ఆమెపై రంగులు, పూలు జల్లుతూ మేళతాళాలతో స్వాగతం పలికి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ శుభ సందర్భంగా కూతురుకు లభించిన అంతటి గౌరవానికి తండ్రి కిస్తూరా రామ్ పొంగిపోయాడు.నేను పని చేసిన హోదా కన్నా పెద్ద హోదాలో నా కూతురు ఉద్యోగం సాధించడం కంటే ఓ తండ్రిగా నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుంది?’’ అంటూ తెగ ఆనందపడిపోయాడు. ఆనందభాష్పాలు కళ్లమ్మలా కారగా కూతురుని మురిపెంగా చూసుకున్నాడు చెమ్మగిల్లిన కళ్లతో. తండ్రి పక్కనే చిరునవ్వు నవ్వుతూ ఉన్న ప్యారీ.. తన ప్రయాణంలో ఈ ఉద్యోగం ఆరంభం మాత్రమే ననీ..తాను ఇంకా సాధించాలనుకుంటున్నానని తెలిపింది. జాతీయ స్థాయిలో జరిగిన పరీక్షలో మెరిట్ ఆధారంగా ప్యారీ ఈ ఉద్యోగం సాధించింది ప్యారీ. ఆమెను చూసి మరింత మంది బాడ్మేర్ అమ్మాయిలు ప్యారీ ని చూసి స్ఫూర్తి పొంది మరింతగా ‘స్మశానం’ గేట్లు బద్దలు కొట్టుకొని వస్తారని కోరుకుందాం..

ఇంతకీ బాడ్మేరాను ఆడపిల్లల శ్మశానం అని ఎందుకు పేరు పడిదంటే.. ఆడపిల్ల పుడితే అశుభంగాను..కీడుగాను భావించేవారు. ఆడపిల్ల చదువుకోవటం..బయటకు వెళ్లటం అంటే చాలా పెద్ద విషయంగా భావించేవారు. చాలామంది ఆడపిల్ల పుడితే చంపేసేవారు కూడా.అందుకే అలా ఆడపిల్లల శ్మశానం అని పేరు వచ్చిందని కొంతమంది చెబుతుంటారు.