Bhatti Vikramarka Budget : ప్రచారానికి తప్ప ప్రజలకు పనికొచ్చేది కాదు- బడ్జెట్ పై భట్టి విక్రమార్క

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉందని అన్నారు. ప్రచారానికి తప్ప ప్రజలకు పనికొచ్చే..(Bhatti Vikramarka Budget)

Bhatti Vikramarka Budget : ప్రచారానికి తప్ప ప్రజలకు పనికొచ్చేది కాదు- బడ్జెట్ పై భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Budget : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉందని ఆయన అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కొత్త పథకాలు తెచ్చామని చెబుతున్నారని మండిపడ్డారు. గతేడాది బడ్జెట్ కూడా పెట్టిన దానికి చేసిన ఖర్చుకు పొంతనే లేదన్నారు. కేటాయింపులు కేవలం చెప్పుకోవడం కోసమే అని అన్నారు.(Bhatti Vikramarka Budget 🙂

ఎన్నికల సందర్భంగా జాగా ఉంటే ఇళ్లు కట్టుకోవడం కోసం రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో రూ.3 లక్షలు మాత్రమే ఇస్తామంటున్నారు అని భట్టి విక్రమార్క అన్నారు. నిరుద్యోగులు, రైతులు.. ఇలా ఏ వర్గానికి ఉపయోగపడని బడ్జెట్ ఇది అని పెదవి విరిచారు. ప్రచారానికి తప్ప ప్రజలకు పనికొచ్చే బడ్జెట్ కాదన్నారు.(Bhatti Vikramarka Budget 🙂

TS Budget 2022-23 : సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవటానికి రూ.3 లక్షలు : మంత్రి హరీశ్ రావు

ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించిందని భట్టి విక్రమార్క అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని మండిపడ్డారు. గవర్నర్ తో ఏమైనా వ్యక్తిగత తగాదాలు ఉంటే వేరే విధంగా చూసుకోవాలన్నారు. గతేడాది జరిగిన పురోగతి చెప్పాల్సి ఉన్నా ప్రభుత్వం చెప్పలేదన్నారు. అందుకే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా కనీసం మావైపు కూడా స్పీకర్ చూడలేదన్నారు భట్టి విక్రమార్క. స్పీకర్ విధానం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని భట్టి విక్రమార్క అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ ప్రసంగంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్య బద్దంగా లేవని అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం కూడా గవర్నర్ ను ఈ విధంగా అవమాన పర్చలేదన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.

గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం దిగజారుడుతనం అని ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు జరుపుతున్నందుకు బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే వారిని సస్పెండ్ చేయడం దారుణం అన్నారు. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు ఉభయసభల్లో ఆందోళన చేసినా కేంద్రం సస్పెండ్ చేయలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

Kishan Reddy Budget : బడ్జెట్ ప్రసంగం.. టీఆర్ఎస్ ప్రభుత్వం వీడ్కోలు ప్రసంగంలా ఉంది-కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2022-23) సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి రూ. 2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.29 వేల 728 కోట్లు ఉందని అంచనా వేశారు. క్యాపిటల్ వ్యయం రూ.29, 728.44 కోట్లుగా లెక్కగట్టారు. రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 2021-22 భారీగా పెరిగినట్లు, జాతీయ- రాష్ట్ర సగటు ఎక్కువగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. కరోనా సమయంలో తెలంగాణ 2శాతం గ్రోత్ లో ఉందని సభకు తెలిపారు. తలసరి ఆదాయం రూ.2లక్ష 78వేల 833కు పెరిగిందన్నారు.