Bhima Jewelers Advertise: అబ్బాయి నుండి అమ్మాయిగా మారిన సున్నితకథ!

సినిమాల కన్నా కూడా ప్రకటనకు మరికాస్త సృజనాత్మకత కావాలి. తన బ్రాండ్ ను మరింతగా ప్రజలలోకి తీసుకెళ్లాలంటే తన బ్రాండ్ లోని ప్రత్యేకతలానే తన ప్రకటనలో కూడా కొత్తదనం కావాలి. అది ప్రజలకు నచ్చేలా గొప్పగా చెప్పాలి. ఇందు కోసం బడా బడా కంపెనీలు కోట్లకు కోట్లు వెచ్చించి ప్రకటనలు తయారుచేస్తారు.

Bhima Jewelers Advertise: అబ్బాయి నుండి అమ్మాయిగా మారిన సున్నితకథ!

Bhima Jewelers Advertise

Bhima Jewelers Advertise: సినిమాల కన్నా కూడా ప్రకటనకు మరికాస్త సృజనాత్మకత కావాలి. తన బ్రాండ్ ను మరింతగా ప్రజలలోకి తీసుకెళ్లాలంటే తన బ్రాండ్ లోని ప్రత్యేకతలానే తన ప్రకటనలో కూడా కొత్తదనం కావాలి. అది ప్రజలకు నచ్చేలా గొప్పగా చెప్పాలి. ఇందు కోసం బడా బడా కంపెనీలు కోట్లకు కోట్లు వెచ్చించి ప్రకటనలు తయారుచేస్తారు. కొందరు అస్లీలత, శృంగారాన్ని నమ్ముకొని ప్రకటనలు చేసుకుంటే.. మరికొందరు ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి ప్రకటనలు రూపొందించుకుంటున్నారు. ఏమైనా చేయనీ తమ బ్రాండ్ ప్రజలలోకి వెళ్లాలని అనుకొనే వారు కూడా ఉండనే ఉన్నారు.

అయితే.. ముఖ్యంగా జ్యువెలర్స్ కంపెనీలు భారీ స్టార్ డం ఉన్న నటీనటులతో పాటు తమ ప్రత్యేకతను చెప్పేలా కొత్తదనంతో కూడిన ప్రకటనలను రూపొందిస్తారు. ఇవి కొన్నిసార్లు తేడా కొట్టేసి సమాజంలో వ్యతిరేకత వచ్చిన ప్రకటనలు కూడా ఉన్నాయనుకోండి. అయితే.. కేరళకు చెందిన భీమా జ్యువెలర్స్ రూపొందించిన ప్రకటన మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే పుట్టుకతో అబ్బాయిగా.. ఎదిగే క్రమంలో అమ్మాయిగా మారిన ఒక ట్రాన్స్ జెండర్ కథతో ఈ ప్రకటనను తెరకెక్కించారు. ఇలాంటి వారిని తల్లిదండ్రులు అర్ధం చేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో హృదయానికి హత్తుకొనేలా తెరకెక్కించారు.

సహజంగా ట్రాన్స్ జెండర్ అంటే సమాజంలో హేళన చేస్తుంటారు. సొంత కుటుంబమే వారిని చిన్న చూపు చూస్తున్నారు. వారిలో మానసికంగా బలమైన వారు కొందరు ట్రాన్స్ హక్కుల కోసం పోరాడుతున్నా సమాజంలో భావన మారడం లేదు. వారిని మనుషులలానే చూడాలని.. వారికి హక్కులు ఉంటాయని మానవ హక్కుల సంఘాలు పోరాడుతున్నా సమాజంలో పెద్ద మార్పులు రావడం లేదు. ఇప్పుడిప్పుడే కొంత మార్పులు కనిపిస్తుండగా భీమా జ్యువెలర్స్ రూపొందించిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.

సొంత తల్లిదండ్రులు, కుటుంబమే వారిలోని భావాలను అర్ధం చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ ప్రకటన కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. అలా అని ఇందులో ఏడుపులు, ఆర్తనాదాలు లేనేలేవు. ఉన్నదల్లా ఆలోజింపజేస్తూ మనసును హత్తుకొనే భావనే. కేవలం 100 సెకన్లలో ఒక వ్యక్తి చిన్న తనం నుండి అమ్మాయిగా మారి పెళ్లి వరకు ఆమె ప్రయాణానానికి విజువల్ ట్రీట్ ఇచ్చారు. అబ్బాయిగా ఉన్న తనకు తండ్రి ఆభరణాన్ని తెచ్చి ఇస్తే అతను తన గడ్డాన్ని చూసుకోవడం.. ఆమె చెవులు కొట్టేందుకు తల్లి ఎదురుచూపులు.. పెళ్లి వైపు నడిపిస్తున్న కూతురుని చూసి తండ్రి మురిసిపోవడం వరకు ఇదొక సందేశాత్మక ప్రకటనను తన వ్యాపార ప్రకటనగా మార్చుకొని భీమా జ్యువెలర్స్ తన ఔన్నత్యాన్ని చాటుకుంది.

Read: Anniyan Remake: హిందీ రీమేక్ హీరోయిన్ ఫైనల్ చేసిన శంకర్!