Bhool Bhulaiyaa2: బాలీవుడ్‌కు బూస్ట్ ఇచ్చి.. ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న మూవీ!

గతకొంత కాలంగా సరైన హిట్లు లేక సతమతమవుతున్న బాలీవుడ్‌కు బూస్ట్ ఇచ్చిన సినిమా ‘భూల్ భులయ్య 2’. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ హార్రర్ కామెడీ....

Bhool Bhulaiyaa2: బాలీవుడ్‌కు బూస్ట్ ఇచ్చి.. ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న మూవీ!

Bhool Bhulaiyaa2 Locks Ott Release Date

Bhool Bhulaiyaa2: గతకొంత కాలంగా సరైన హిట్లు లేక సతమతమవుతున్న బాలీవుడ్‌కు బూస్ట్ ఇచ్చిన సినిమా ‘భూల్ భులయ్య 2’. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ హార్రర్ కామెడీ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సీక్వెల్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అనీస్ బాజ్మీ తెరకెక్కించిన ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.

ఇక ఈ సినిమా బాలీవుడ్‌కు బూస్ట్ ఇవ్వడంతో క్రిటిక్స్ సైతం ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. సౌత్ సినిమాలతోనే నెట్టుకు వస్తున్న బాలీవుడ్‌కు అసలు సిసలైన హిట్ అందించిన సినిమాగా ‘భూల్ భులయ్యా2’ నిలిచింది. ఈ సినిమా కార్తీక్ ఆర్యన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో, ఈ సినిమాపై సౌత్ ఆడియెన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను కూడా లాక్ చేసుకుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ‘భూల్ భులయ్యా 2’ చిత్రాన్ని జూలై 17న స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యింది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూడలేని వారు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ డేట్ రావడంతో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వెండితెరపై బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎంతమేర అలరిస్తుందో చూడాలి.