Bhumika Chawla : మందు గ్లాసుతో భూమిక.. ఫోటోలు వైరల్‌

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. తన ఓరచూపుతో కుర్రకారును ఎట్రాక్ట్ చేసిన నటి భూమిక.. తెలుగులో టాప్ హీరోలందరి సరసన నటించిన ఈమె.. పెళ్లితర్వాత సినిమాలకు దూరమయ్యారు. పదేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి నటించడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే భూమిక చావ్లా.. తాజాగా డ్రింక్ చేస్తూ దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

Bhumika Chawla : మందు గ్లాసుతో భూమిక.. ఫోటోలు వైరల్‌

Bhumika Chawla

Bhumika Chawla : భూమిక చావ్లా.. పదిహేనేళ్లక్రితం టాప్ ఫైవ్ తెలుగు హీరోయిన్లలో ఒకరుగా ఉండేవారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే యోగ టీచర్ భరత్ ఠాకూర్ ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. భూమిక తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూనే చూపులతో కుర్రకారును ఎట్రాక్ట్ చేసింది.

తెలుగులో చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోల సరసన నటించింది. పెళ్లి తర్వాత పదేళ్ళపాటు సినిమాలకు దూరమైన భూమిక ఇటీవల సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. ఎంసీఏ చిత్రంలో హీరో నాని వదినగా నటించి మెప్పించింది.

కరోనా కారణంగా ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు లేనప్పటికీ, సోషల్‌ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడు టచ్‌లోనే ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు, పర్సనల్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.

తాజాగా భూమిక మందు గ్లాసుతో దర్శనమిచ్చి అందరికి షాకిచ్చింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేశానంటూ మందు తాగుతున్న ఫోటోలను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. భూమిక షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.