PM Modi : మోదీ ఖాతాలో మరో అరుదైన ఘనత.. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక

పొరుగుదేశాలతో బలమైన మైత్రీ సంబంధాల కోసం ప్రత్యేక కృషిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన గౌరవం సాధించారు.

PM Modi : మోదీ ఖాతాలో మరో అరుదైన ఘనత.. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక

Pm Modi

PM Modi : పొరుగుదేశాలతో బలమైన మైత్రీ సంబంధాల కోసం ప్రత్యేక కృషిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన గౌరవం సాధించారు. ప్రధాని మోదీని భూటాన్ అత్యున్నత పురస్కారం వరించింది. ఈ పౌర పురస్కారానికి ప్రధాని మోదీని ఎంపిక చేసినట్లు భూటాన్ ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అత్యున్నత అవార్డు ‘నగదాగ్ పెల్ గి ఖోర్లో’ను మోదీకి బహూకరించాలని భూటాన్​ రాజు జిగ్మే ఖేసర్ ​నగ్మే వాంగ్​చుక్​ సూచించినట్లు తెలిపింది.

చదవండి : PM Modi Varanasi Tour : దివ్యాంగురాలి పాదాలకు మొక్కిన ప్రధాని మోదీ.. ఫొటో వైరల్

కాగా ఈ అవార్డును 2008లో భూటాన్ ప్రవేశపెట్టగా అప్పటినుంచి ఇప్పటివరకు ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీయుడు మన ప్రధాని మోదీ మాత్రమే. భూటాన్ దేశ జాతీయ దినోత్సవం డిసెంబర్ 17కావడంతో ఈ రోజు ఆ అవార్డును మోదీకి ప్రదానం చేసినట్లు ప్రధాని లోటే షేరింగ్ తెలిపారు. ఈ అవార్డు మోదీకి ఇవ్వడం తమకెంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డు అందుకునేందుకు మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

చదవండి : PM Modi: ప్రపంచంలోని ప్రశంసనీయ వ్యక్తుల్లో ఎనిమిదో స్థానంలో ప్రధాని మోదీ

కాగా గతంలో సౌదీ అరేబియా, అప్ఘనిస్తాన్ దేశాలు కూడా ప్రధాని మోదీని తమ దేశ పౌర పురస్కారాలతో సత్కరించాయి. అమెరికా సైన్యం అందించే ‘లెజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును కూడా మోదీ అందుకున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా.. మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ప్రధాని మోదీ తమ దేశానికి అందించిన బేషరతు సాయాన్ని మర్చిపోలేమని భూటాన్ ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. భూటాన్ ప్రజల తరఫున ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపింది.