5G Auction: మొదటి రోజు ముగిసిన 5జీ వేలం..

మొదటి రోజు రూ. 4.3 లక్షల కోట్ల విలువైన 72 GHz (గిగాహెర్ట్జ్) 5G ఎయిర్‌వేవ్‌ల కోసం స్పెక్ట్రమ్ వేలం నిర్వహించగా.. నాలుగు రౌండ్ల వేలంతో ముగిసింది. తొలిరోజు వేలం మొత్తం ₹ 1.45 లక్షల కోట్లు దాటింది. 700 MHz బ్యాండ్ ఫ్రీక్వెన్సీల కోసం బిడ్‌లు కూడా వచ్చాయని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

5G Auction: మొదటి రోజు ముగిసిన 5జీ వేలం..

5G Auction: 5జీ స్పెక్ట్రమ్ వేలం మంగళవారం ప్రారంభమైన విషయం విధితమే. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సంస్థలు బిడ్ లు దాఖలు చేశాయి. మొదటి రోజు రూ. 4.3 లక్షల కోట్ల విలువైన 72 GHz (గిగాహెర్ట్జ్) 5G ఎయిర్‌వేవ్‌ల కోసం స్పెక్ట్రమ్ వేలం నిర్వహించగా.. నాలుగు రౌండ్ల వేలంతో ముగిసింది. తొలిరోజు వేలం మొత్తం ₹ 1.45 లక్షల కోట్లు దాటింది. 700 MHz బ్యాండ్ ఫ్రీక్వెన్సీల కోసం బిడ్‌లు కూడా వచ్చాయని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఐదో రౌండ్ వేలం రేపటి నుంచి ప్రారంభం కానుంది.

National Herald case: 6గంటల పాటు సోనియాను విచారించిన ఈడీ.. రేపు మరోసారి హాజరుకావాలని సమన్లు

టెలికాం మంత్రి మాట్లాడుతూ.. ఆగస్ట్ 15 నాటికి స్పెక్ట్రమ్ కేటాయింపును పూర్తి చేయాలని ఆశిస్తున్నామని అన్నారు. 2022 చివరి నాటికి చాలా నగరాల్లో 5G సేవలు అందుతాయని తెలిపారు. ఇదిలాఉంటే ఈ వేలంలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ యూనిట్ 5G స్పెక్ట్రమ్ కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి.

Vijay Devarakonda: ముగ్గురితో సై అంటోన్న రౌడీ!

అయితే వేలం ఎన్ని రోజులు సాగుతుందనేది బిడ్డర్ల వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. ఇదిలాఉంటే 4Gలో 40 నిమిషాలకు బదులుగా 5G ఇంటర్నెట్‌ని ఉపయోగించడం ద్వారా 5 GB సినిమాను 35 సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే 4Gతో పోలిస్తే 10 రెట్లు వేగవంతంగా డేటా సేవలు అందించే వీలుంటుంది.