IPL 2023: రూ.43వేల కోట్లు దాటిన టెలికాస్టింగ్ హక్కుల ధర

ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) టీవీ, డిజిటల్ రైట్స్‌ కోసం పెద్ద ఎత్తున పోటీ జరుగుతుంది. ఈ ఏడాదితో స్టార్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగిసింది.

IPL 2023: రూ.43వేల కోట్లు దాటిన టెలికాస్టింగ్ హక్కుల ధర

Ipl

IPL 2023: ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) టీవీ, డిజిటల్ రైట్స్‌ కోసం పెద్ద ఎత్తున పోటీ జరుగుతుంది. ఈ ఏడాదితో స్టార్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగిసింది. దీంతో బడా కంపెనీలన్నీ టెలికాస్ట్ రైట్స్ కోసం పోటీపడుతుననాయి. ముగిసింది.

ఇక 2023-2027 వరకు బ్రాడ్‌కాస్టింగ్, స్ట్రీమింగ్ హక్కుల కోసం బిడ్డింగ్ జరుగుతుండగా.. తొలిసారిగా బీసీసీఐ ఈ-వేలం నిర్వహిస్తోంది. ఫలితంగా టీవీ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు సుమారు రూ.22వేల 500 కోట్లు చేరినట్లు సమాచారం. అదే సమయంలో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విలువ రూ.19 వేల కోట్లకు చేరిందట.

ఈ వేలాన్ని పరిశీలిస్తున్న నిపుణులు హక్కుల రేట్లు మరింత పెరుగునున్నట్లు భావిస్తున్నారు. డిజిటల్ హక్కులు రూ.22 వేల కోట్ల వరకు పలుకుతాయని, టీవీ హక్కులు సుమారు రూ.25 వేల కోట్లకు చేరతాయని అంటున్నారు. ప్రస్తుతం జరిగే హడావిడి మొత్తం భారత ఉపఖండంలో స్ట్రీమింగ్, బ్రాడ్‌కాస్టింగ్‌ చేసుకునేందుకు మాత్రమే కావడం గమనార్హం.

IPL 2022 : ఐపీఎల్ గ్రౌండ్స్‌మెన్‌కు రూ.1.25 కోట్ల నజరానా : బీసీసీఐ ప్రకటన

ఈ లెక్కన ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ టెలికాస్టింగ్ వాల్యూ రూ.100 కోట్లు దాటిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇది 2018-2022 మధ్య రూ.55 కోట్లుగా ఉండేది.