Biden: గ‌గ‌న‌త‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ వ‌చ్చిన విమానం.. సుర‌క్షిత ప్రాంతానికి అమెరికా అధ్య‌క్షుడు బైడెన్

అమెరికాలోని డెలావెయ‌ర్‌లో గ‌గ‌న‌త‌ల నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ ఓ చిన్న‌పాటి ప్రైవేటు విమానం దూసుకురావ‌డంతో అధ్య‌క్షుడు జో బైడెన్‌ను భ‌ద్ర‌తా సిబ్బంది వెంట‌నే అక్క‌డి రెహోబొత్ బీచ్‌లోని ఓ సుర‌క్షిత‌ నివాసానికి త‌ర‌లించారు.

Biden: గ‌గ‌న‌త‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ వ‌చ్చిన విమానం.. సుర‌క్షిత ప్రాంతానికి అమెరికా అధ్య‌క్షుడు బైడెన్

Us President Biden's Visit To Ukraine Only A Matter Of Time Intelligence Committee Chief (1)

Biden: అమెరికాలోని డెలావెయ‌ర్‌లో గ‌గ‌న‌త‌ల నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ ఓ చిన్న‌పాటి ప్రైవేటు విమానం దూసుకురావ‌డంతో అధ్య‌క్షుడు జో బైడెన్‌ను భ‌ద్ర‌తా సిబ్బంది వెంట‌నే అక్క‌డి రెహోబొత్ బీచ్‌లోని ఓ సుర‌క్షిత‌ నివాసానికి త‌ర‌లించారు. ఆ విమానం రెహోబొత్ డెలావెయ‌ర్‌లోని జో బైడెన్ ఇంటిపై నిషేధిత‌ గ‌గ‌న‌త‌లంలో క‌న‌ప‌డింద‌ని అధికారులు వివ‌రించారు. ఆ ప్రైవేటు విమానం పొర‌పాటున గ‌గ‌న‌త‌ల నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లు అనుమానిస్తున్నామ‌ని శ్వేత‌సౌధ సిబ్బంది చెప్పారు.

warangal: ప్రమాదకర రసాయనాలతో పాల త‌యారీ.. ఎన్ఎస్సార్ డైరీ ఫాం సీజ్‌

జో బైడెన్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ఎలాంటి ముప్పు లేద‌ని ఆ వెంట‌నే గుర్తించామ‌ని వివ‌రించారు. అనంత‌రం జో బైడెన్‌తో పాటు ఆయ‌న కుటుంబం తిరిగి డెలావెయ‌ర్‌లోని ఆయ‌న ఇంటికి వెళ్లిన‌ట్లు చెప్పారు. ప్రైవేటు విమాన పైల‌ట్ చేసిన త‌ప్పిదం కార‌ణంగానే గ‌గ‌న‌త‌ల నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘన జ‌రిగింద‌ని తెలిపారు. ఆ పైల‌ట్‌ను విచారిస్తున్నామ‌ని చెప్పారు. కాగా, 2017, ఆగ‌స్టులోనే ఇటువంటి ఘ‌ట‌నే అమెరికాలో చోటు చేసుకుంది. ర‌ష్యాకు చెందిన ఎయిర్ ఫోర్స్ విమానం అమెరికా క్యాపిట‌ల్, పెంట‌గాన్, సీఐఏ ప్ర‌ధాన కార్యాల‌యం మీదుగా వెళ్లి క‌ల‌క‌లం రేపింది. ఆ విమానంలో ఆర్మీ సిబ్బంది ఎవ‌రూ లేర‌ని అప్ప‌ట్లో అధికారులు గుర్తించారు.