5G spectrum: రూ.1.5 లక్షల కోట్లు దాటిన 5జీ స్పెక్ట్రమ్ వేలం..

ఆరు రోజుల్లో 37 రౌండ్ల 5జీ స్పెక్ట్రం వేలంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 1,50,130 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. వేలం ప్రక్రియ 38వ బిడ్ నుండి సోమవారం కూడా కొనసాగుతుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం ప్రకటించారు.

5G spectrum: రూ.1.5 లక్షల కోట్లు దాటిన 5జీ స్పెక్ట్రమ్ వేలం..

5g Spectram

5G spectrum: ఆరు రోజుల్లో 37 రౌండ్ల 5జీ స్పెక్ట్రం వేలంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 1,50,130 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. వేలం ప్రక్రియ 38వ బిడ్ నుండి సోమవారం కూడా కొనసాగుతుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం ప్రకటించారు. 6వ రోజు (ఆదివారం) వేలం ముగిసే సమయానికి ఏడు రౌండ్ల వేలం కొనసాగింది. బిడ్డింగ్ కోసం కనీసం రూ. 4.3 లక్షల కోట్ల విలువైన మొత్తం 72 GHz (గిగాహెర్ట్జ్) రేడియోవేవ్‌లతో అల్ట్రా-హై డేటా స్పీడ్‌ను అందించే 5G స్పెక్ట్రమ్‌కి కేంద్ర ప్రభుత్వం తొలిసారి వేలం ప్రక్రియను నిర్వహిస్తోంది.

5G Spectrum: నాలుగు రోజుల వేలంలో రూ.1,49,855 కోట్ల విలువైన బిడ్లు .. రేపు కూడా కొనసాగనున్న వేలం

ఈ వేలంలో ఆరు రోజుల్లో 37 రౌండ్ల బిడ్డింగ్ పూర్తయింది. కేంద్ర ప్రభుత్వానికి రూ. 1,50,130 కోట్లకు పైగా వేలం వచ్చింది. శనివారం వారం వేలం ఏడు రౌండ్ల బిడ్డింగ్ తర్వాత రూ. 1,49,966 కోట్ల విలువైన బిడ్‌లను పొందింది. శుక్రవారం కూడా ఏడు రౌండ్ల బిడ్డింగ్ జరగ్గా రూ. 1,49,855 కోట్ల విలువైన బిడ్‌లు వచ్చాయి. టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. టెలికం సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లోకి సేవలను తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. వేలం ప్రక్రియ చూస్తుంటే సమస్య నుండి బయటపడి వృద్ధి దశలోకి వస్తోందని తెలిపారు.

OnePlus 10T 5G: ఆగ‌స్టు 3న‌ వన్‌ప్లస్ 10T 5జీ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌

ఇదిలా ఉంటే 5G స్పెక్ట్రమ్ కోసం వేలం వేయడానికి రేసులో ప్రధానంగా నాలుగు సంస్థలు పోటీ పడుతున్నాయి. వాటిలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మరియు గౌతమ్ అదానీ యొక్క ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ యూనిట్లు ఉన్నాయి. అయితే 5G స్పెక్ట్రమ్ వేలం ఎన్ని రోజులు సాగుతుందనేది రేడియో తరంగాల వాస్తవ డిమాండ్, వ్యక్తిగత బిడ్డర్ల వ్యూహంపై ఆధారపడి ఉంటుంది.