PM Modi : ‘బిగ్‌ బ్రదర్’ అందరి ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు : మోడీపై మార్గరెట్ అల్వా విసుర్లు

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా బిగ్‌ బ్రదర్ అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి చణుకులు విసిరారు. ‘బిగ్ బ్రదర్’ రాజకీయ నేతల ఫోన్లు టాప్ చేసి అందరి మాటలు వింటున్నారని వ్యాఖ్యానించారు.

PM Modi : ‘బిగ్‌ బ్రదర్’ అందరి ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు : మోడీపై మార్గరెట్ అల్వా విసుర్లు

'big Brother' Is Tapping Everyone's Phones..margaret Alva

‘Big Brother’ is tapping everyone’s phones..Margaret Alva :  విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. బిగ్‌ బ్రదర్ అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి చణుకులు విసిరారు. ‘బిగ్ బ్రదర్’ రాజకీయ నేతల ఫోన్లు టాప్ చేసి అందరి మాటలు వింటున్నారు..దీంతో ఆయ నేతల్లో భయం పెరిగి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుందని మంగళవారం (26,2022) మీడియాతో మాట్లాడుతూ..తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

‘బిగ్ బ్రదర్‌ అంతా గమనిస్తున్నారని..మా మాటలు కూడా ఆయన చెవిలో పడతాయని..దాని వల్ల తమ రాజకీయ భవిష్యత్తుకు ఎక్క విఘాత ఏర్పడతుందోనని నాయకులు ఫోన్ల వాడకాలు పెరిగాయని అన్నారు. అంటే నేతలు ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు..నంబర్లు వాడుతుంటారని అన్నారు అల్వా. తమ మాటలు వింటున్నారనే భయం సరికొత్త భారతంలో పార్టీలకు అతీతంగా విస్తరిస్తోంది. దాంతో ఎంపీలు, రాజకీయ నేతలు ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు, నంబర్లు వాడుతుంటారు.

ఫోన్లలో మాట్లాడుకుంటే పెద్దాయనకు తెలిసిపోతుందనే భయంతో నాయకులు వారు ముఖా ముఖీ కలుసుకున్నప్పుడు గుసగుసలాడుకుంటారంటూ ఎద్దేవా చేశారు. ఇటువంటి భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌ను ట్యాగ్ చేస్తూ.. తన కాల్స్‌ను మళ్లీస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి చెందిన కొంతమంది ఫ్రెండ్స్ తో మాట్లాడాను..ఆ తరువాత నుంచి నాకు ఫోన్ కు వచ్చే అన్నికాల్స్ డైవర్ట్ అవుతున్నయని వెల్లడించారామె.

ఆరోజు నుంచి నేను కాల్ చేసుకోలేకపోతున్నానని అన్నారు.నా ఫోన్ కు ఎవరి ఫోన్‌ నుంచి కూడా కాల్స్ రావటంలేదన్నారు. మీరు నా సమస్యను పరిష్కరిస్తే.. ఇప్పటి నుంచి బీజేపీ, బీజేడీ, టీఎంసీకి చెందిన ఏ ఎంపీకి ఫోన్ చేయను’ అంటూ ట్వీట్ చేశారు.దీనిపై వెంటనే బీఎస్‌ఎన్‌ఎల్ స్పందించిందని టెలికాం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మార్గరెట్ అల్వా ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుందని..ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని పేర్కొన్నాయి.