Chris Gayle: సిక్సుల వర్షంతో క్రిస్ గేల్ పేరిట మరో రికార్డ్

రాజస్థాన్ రాయల్స్ బెన్ స్టోక్స్ తొలి బంతికే బాదేసి ఐపీఎల్ చరిత్రలోనే 350సిక్సులు నమోదు చేసిన ప్లేయర్‌గా..

Chris Gayle: సిక్సుల వర్షంతో క్రిస్ గేల్ పేరిట మరో రికార్డ్

Chris Gayle

Chris Gayle: ముంబై వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించేలా చెలరేగాడు క్రిస్ గేల్. రాజస్థాన్ రాయల్స్ బెన్ స్టోక్స్ తొలి బంతికే బాదేసి ఐపీఎల్ చరిత్రలోనే 350సిక్సులు నమోదు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఆసక్తికరమైన అంశమేమిటంటే.. డివిలియర్స్ 257సిక్సులతో తర్వాతి స్థానంలో నిలిచాడు.

ఈ జమైకా ప్లేయర్ ఎక్స్‌ప్లోజివ్ బ్యాటింగ్, బిగ్ హిట్టింగ్ కనిపించకపోవడంతో గత సీజన్ లో ఎక్కువ మ్యాచ్ లలో ఆడలేకపోయాడు. అప్పుడు కూడా అవకాశం దొరికిన ఏడు మ్యాచ్ లలో ఆడి.. 288పరుగులు చేయగలిగాడు. గత సీజన్లో గేల్ బాదిన 23 సిక్సులు, 15ఫోర్లు.

సోమవారం రాహుల్ తేవాటియా బౌలింగ్ లో 351వ సిక్సు బాదాడు గేల్. ఆ తర్వాత రియాన్ పరాగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ 41ఏళ్ల వెస్టిండీస్ ఓపెనర్ 13సీజన్లలో 133 మ్యాచ్ లు ఆడి క్యాష్ రిచ్ టోర్నమెంట్లో 4వేల 800పరుగులు చేయగలిగాడు.