Lalu Prasad Yadav: 13ఏళ్ల క్రితం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊరట..

13 సంవత్సరాల నాటి కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కు ఊరట లభించింది. ఆ కేసులో లాలూను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది...

Lalu Prasad Yadav: 13ఏళ్ల క్రితం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊరట..

Lalu Prasad Yadav

Lalu Prasad Yadav: 13 సంవత్సరాల నాటి కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కు ఊరట లభించింది. ఆ కేసులో లాలూను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం జార్ఖండ్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు అతనికి ఆరువేల రూపాయల జరిమానా విధించి. కేసుకు సంబంధించి ఇకపై కోర్టుకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది.

Lalu Prasad Yadav : లాలూ ప్రసాద్ యాద‌వ్ కు మళ్లీ అస్వస్థత..ఢిల్లీ ఎయిమ్స్ లో అత్యవసర చికిత్స

2009 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలము జిల్లాలోని గర్వా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆర్జేడీ తరపున గిరినాథ్ సింగ్ బరిలో నిలిచారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన ప్రచారం కోసం.. హెలికాప్టర్ లో గర్వా చేరుకున్నారు. ఇక్కడి గోవింద్ హైస్కూల్ లో ఆయన ఎన్నికల సమావేశం జరగనుంది. అతని హెలికాప్టర్ లో ల్యాండ్ చేయడానికి గర్వా బ్లాక్ లోని కళ్యాణ్ పూర్ లో హెలిప్యాడ్ నిర్మించారు. దీనికి పరిపాలన అనుమతి ఇచ్చింది. కానీ నిర్ణీత హెలిప్యాడ్ లో దిగకుండా గోవింద్ హైస్కూల్ మైదానంలోని సభా స్థలంలో హెలికాప్టర్ ను దించారు. దీంతో సమావేశంలో ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు లాలూ యాదవ్ పై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది.

Lalu Prasad Yadav: దాణా కేసులో లాలూకు 5 ఏళ్ల జైలు శిక్ష రూ.60 లక్షల జరిమానా

లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం ఉదయం పాలమూ కోర్టుకు చేరుకున్నారు. 28నిమిషాల పాటు ఆయన కోర్టులో ఉన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు లాలూ సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్యే సతీష్ ముడా మాట్లాడుతూ.. ప్రత్యేక కోర్టుకు లాలూ హాజరయ్యారని, దాదాపు 28 నిమిషాల పాటు ఆయన కోర్టులో ఉన్నారని. ఇదిలాఉంటే ఈ కేసులో లాలూ ఇప్పటికే నెలన్నర జైలు జీవితం గడిపారు. 6,000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌తో కేసు ముగిసింది.