Union Bank Scam : యూనియన్ బ్యాంకులో భారీ కుంభకోణం, రైతుల పేరుతో రూ.2.80 కోట్లు స్వాహా

యూనియన్ బ్యాంకు (ఆంధ్ర బ్యాంక్)లో భారీ కుంభకోణం జరిగింది. బ్యాంకు సిబ్బంది ఘరానా మోసానికి పాల్పడ్డారు. రైతులు రుణాలు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించిన బ్యాంకు సిబ్బంది..

Union Bank Scam : యూనియన్ బ్యాంకులో భారీ కుంభకోణం, రైతుల పేరుతో రూ.2.80 కోట్లు స్వాహా

Union Bank Scam

Union Bank Scam : సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట యూనియన్ బ్యాంకు (ఆంధ్ర బ్యాంక్)లో భారీ కుంభకోణం జరిగింది. బ్యాంకు సిబ్బంది ఘరానా మోసానికి పాల్పడ్డారు. రైతులు రుణాలు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించిన బ్యాంకు సిబ్బంది.. పెద్ద మొత్తంలో నగదు కాజేశారు. రైతుల పేరుతో సుమారు 2కోట్ల రూపాయలకు పైగా నగదు కాజేసినట్లు తెలుస్తోంది.

సుమారు రూ.2.80 కోట్ల గోల్ మాల్ జరిగినట్లు సమాచారం. తమ పేర్లతో లోన్లు తీసుకుని మోసం చేసిన బ్యాంకు సిబ్బందిపై బాధిత రైతులు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యూనియన్ బ్యాంకులో వెలుగుచూసిన ఈ గోల్ మాల్ స్థానికంగా సంచలనంగా మారింది. మోసానికి పాల్పడిన బ్యాంకు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Weight Loss : బరువు తగ్గటంలో వ్యాయామాలకు తోడుగా..

తాము రుణాలు తీసుకోకపోయినా డబ్బులు కట్టాలంటూ నోటీసులు రావడంతో రైతులు షాక్ తిన్నారు. అసలేం జరిగిందోనని బ్యాంకుకి వెళ్లి ఆరా తీశారు. ప్రస్తుతం మేనేజర్ గా ఉన్న అధికారిని నిలదీశారు. అప్పుడే బ్యాంకు సిబ్బంది ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

Fresh Meat : తాజా మాంసాన్ని గుర్తించటం ఎలాగంటే?

యూనియన్ బ్యాంకులో ఈ గోల్ మాల్ 2017 నుంచి జరుగుతున్నట్లు తెలిసింది. కొందరు రైతులకు పెన్షన్లు రావడం లేదు. మరికొందరకి రైతుబంధు నగదు అందలేదు. గొర్రెల లోన్, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు.. ఇలా ఏ డబ్బూ అందలేదు. దీంతో ఆందోళనకు గురైన రైతులు అసలేం జరిగిందో తెలుసుకోవడానికి బ్యాంకుకి వెళ్లారు. ఈ క్రమంలో ఈ బాగోతం బయటపడింది. రూ.2.80 కోట్ల స్కామ్ జరిగినట్లు తెలిసింది. బ్యాంకు సిబ్బంది, మాజీ సర్పంచ్ కుమారుడు భిక్షపతి కలిసి ఈ గోల్ మాల్ చేసినట్లుగా బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. అసలు భూమే లేని వ్యక్తి పేరు మీద కూడా క్రాప్ లోన్ తీసుకోవడం విశేషం. అంతేకాదు లక్షల్లో డబ్బులు కట్టాలంటూ అధికారులు అతడికి నోటీసులు కూడా పంపడం గమనార్హం.