హీరోగా ‘బిగ్ బాస్’ సోహైల్.. లుక్ అదిరిందిగా!

హీరోగా ‘బిగ్ బాస్’ సోహైల్.. లుక్ అదిరిందిగా!

Syed Sohel Ryan:‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెజర్ కుక్కర్’ లాంటి సినిమాలతో విమర్శకులనుంచి ప్రశంసలు అందుకుని తన మూడవ చిత్రాన్ని బిగ్ బాస్ ఫేం సోహైల్ తో నిర్మిస్తున్నారు నిర్మాత అప్పి రెడ్డి.. శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

SOHEL

ఈ సందర్భంగా నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా మైక్ మూవీ నుండి ‘జార్జి రెడ్డి’ , ‘ప్రెషర్ కుక్కర్’ వంటి మూవీస్ తీశాం.. అవి ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడవ సినిమాను కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి తో కలసి బిగ్ బాస్ ఫేం సోహైల్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌గా చేస్తున్నాం.. ఇప్పటివరకు భారతదేశ చిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్‌తో ఈ సినిమా ఉంటుంది.భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం. ఈ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం..’’ అన్నారు.

SOHEL

SOHEL

టెక్నీషియన్స్…
మ్యూజిక్ : శ్రావణ్ భరధ్వాజ్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
ఆర్ట్: గాంధీ నడికుడికార్
నిర్మాతలు: అప్పిరెడ్డి,సజ్జల రవిరెడ్డి,అభిషేక్ రెడ్డి
రచన,దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి.

SOHEL