అభిజీత్ ఫ్యాన్స్‌పై సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసిన మోనాల్..

అభిజీత్ ఫ్యాన్స్‌పై సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసిన మోనాల్..

Monal Gajjar Files Cyber Crime: బిగ్ బాస్ 4 లో పార్టిసిపేట్ చేసి ఇటీవలే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మోనాల్ గజ్జర్.. తోటి కంటెస్టెంట్ అభిజీత్ ఫ్యాన్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన చెల్లెలు హేమాలి ని అభీజిత్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తుండడంతో మనస్తాపానికి గురైందని… వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటూ మోనాల్ పోలీసులను ఆశ్రయించింది.

Monal Gajjar

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన హేమాలి, అభిజీత్ గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అభిజీత్ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేశారు. చెల్లిని వారు ఘోరంగా ట్రోల్ చేస్తుండడంతో మోనాల్ కంప్లైంట్ చేసింది.

Monal Gajjar

ఈ సంఘటన గురించి మోనాల్ మాట్లాడుతూ.. ‘అభిజీత్, మోనాల్ వెనుక మాట్లాడతాడు.. అలా మాట్లాడకూడదు.. అని ఒకే ఒక్కమాట అంది హేమాలి. అతను చాలా సార్లు నా వెనుక మాట్లాడాడు.. మా చెల్లి ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది. ఆ మాటను నెగెటివ్‌గా తీసుకుని తనను బాగా ట్రోల్ చేస్తున్నారు.. చంపేస్తామని బెదిరిస్తున్నారు.. వారి ఆగడాలు మరీ మితిమీరడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను’.. అని చెప్పుకొచ్చింది మోనాల్..