Bigg Boss Telugu: సీజన్-5 అనుకున్నట్లే వస్తుందా?.. వాయిదా పడుతుందా?

ఎదుటివారి జీవితాలలోకి తొంగి చూడడం అంటే సరదా. అదీ సెలబ్రిటీలైతే ఇంట్లో ఎలా ఉంటారో.. ఏం తింటారో? అసలు వాళ్ళు ఇంట్లో సాధారణంగానే ఉంటారా? లేక అక్కడ కూడా నటిస్తారా? ఈ క్యూరియాసిటీని బేస్ చేసుకొని రూపొందిందే Bigg Boss కార్యక్రమం.

Bigg Boss Telugu: సీజన్-5 అనుకున్నట్లే వస్తుందా?.. వాయిదా పడుతుందా?

Bigg Boss Telugu

Bigg Boss Telugu: ఎదుటివారి జీవితాలలోకి తొంగి చూడడం అంటే సరదా. అదీ సెలబ్రిటీలైతే ఇంట్లో ఎలా ఉంటారో.. ఏం తింటారో? అసలు వాళ్ళు ఇంట్లో సాధారణంగానే ఉంటారా? లేక అక్కడ కూడా నటిస్తారా? ఈ క్యూరియాసిటీని బేస్ చేసుకొని రూపొందిందే Bigg Boss కార్యక్రమం. ఇతర దేశాలలో ఒరిజినల్ కార్యక్రమానికి పలుమార్పులు చేసి మన దేశంలో మొదలైన ఈ Bigg Boss షో మన తెలుగులో కూడా మంచి ఆదరణే దక్కించుకుంది. తొలి భాగానికి జూనియర్ ఎన్టీఆర్ మార్క్ హైప్ ఇచ్చి మొదలైన ఈ Bigg Boss Telugu ఇప్పటికి నాలుగు భాగాలు పూర్తిచేసుకుంది.

ఈ ఏడాది Bigg Boss Telugu 5 మొదలు కావాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా Bigg Boss వస్తాడా రాడా అన్నది చర్చగా మారింది. గత ఏడాది కూడా ఇదే సమయానికి కరోనా వ్యాప్తి ఉదృతంగానే ఉంది. అందుకే Bigg Boss Telugu 4 కాస్త ఆలస్యంగానే మొదలైంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న నిర్వాహకులు ఈ సీజన్ ను ముందుగానే మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అసలు మొదలు పెట్టగలరా అనే అనుమానాలొస్తున్నాయి.

నిజానికి ఈ ఏడాది ప్రారంభం నుండే ఈ సీజన్ కంటెస్టెంట్స్ ప్రక్రియ మొదలుపెట్టినట్లుగా కథనాలొచ్చాయి. సినీ, సోషల్ మీడియా సెలబ్రిటీల కలయికతో ఈ సీజన్ Bigg Boss Telugu హౌస్ నింపనున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు కరోనా పరిస్థితులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో మరో మూడు నెలల పాటు ఈ సీజన్ మొదలయ్యే పరిస్థితి లేదని సినీ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. నిజానికి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యే ఇలాంటి సమయంలో Bigg Boss Telugu లాంటి బజ్ ఉన్న షోస్ ఉంటే టీఆర్పీలు కూడా గట్టిగానే రాబట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు కంటెస్టెంట్స్ సైతం భయపడాల్సిన పరిస్థితి. మరి ఆగష్టు వరకు వాయిదాకు సిద్దమవుతారా? లేక గత ఏడాది మాదిరి షో మొదలు పెడతారా అన్నది చూడాల్సి ఉంది.