Vanitha Vijay Kumar: పవర్ స్టార్‌తో వనితా నాలుగో పెళ్లి?

అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రిందటే తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. సినిమాలతో కన్నా కాంట్రవర్సిలు.. పెళ్లిలతోనే యమా ఫేమస్ అయింది బిగ్ బాస్ బ్యూటీ వనిత విజయ్ కుమార్. ఆ మధ్య దేశమంతా లాక్ డౌన్ లో అంతుబట్టకుంటే వనితా.. పీటర్ పాల్ ను మూడో పెళ్లి చేసుకొని హాట్ టాపిక్ గా నిలిచింది.

Vanitha Vijay Kumar: పవర్ స్టార్‌తో వనితా నాలుగో పెళ్లి?

Vanitha Vijay Kumar

Vanitha Vijay Kumar: అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రిందటే తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. సినిమాలతో కన్నా కాంట్రవర్సిలు.. పెళ్లిలతోనే యమా ఫేమస్ అయింది బిగ్ బాస్ బ్యూటీ వనిత విజయ్ కుమార్. ఆ మధ్య దేశమంతా లాక్ డౌన్ లో అంతుబట్టకుంటే వనితా.. పీటర్ పాల్ ను మూడో పెళ్లి చేసుకొని హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే, పెళ్లి జరిగిన కొనాళ్లకే పీటర్ పాల్‌కు గుడ్‌బై చెబుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

తాజాగా తమిళనాడు పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో పెళ్లి జరిగినట్టు ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్‌‌‌లో ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ.. లవ్ సింబల్స్‌‌‌తోపాటు పవర్‌‌‌‌స్టార్ ఇక్కడ.. అని రాసుకొచ్చింది. దాంతో నెటిజన్లు ఈ ఫోటోతో ఇప్పుడు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడు ఏకంగా నాలుగో పెళ్లి చేసుకుందా అని చర్చించుకుంటున్నారు. నిజంగానే శ్రీనివాసన్‌తో పెళ్లి జరిగిందా లేక ఇది ఏదైనా సినిమా ప్రొమోషన్ లో భాగమా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

ఏదిఏమైనా ఇప్పుడు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు వనితాను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఈ మధ్యనే నటి రమ్యకృష్ణ తనను వేధిస్తున్నారంటూ ఓ టీవీ షోలో నుండి బయటకొచ్చేసిన వనితా ఆ తర్వాత కూడా తన వింత వాదనతో ఆరోపణలు చేస్తుంది. దీంతో అసలే వనితా మీద తమిళ ప్రేక్షకులు కొందరు పీకల వరకు కోపం ఉండగా ఇప్పుడు ఈ ఫోటోపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

వనితా 2000లో నటుడు ఆకాష్ ని పెళ్లి చేసుకొని 2007లో అతని నుంచి విడిపోగా.. ఆ తర్వాత వ్యాపారవేత్త ఆనంద్ జే రాజన్ ని పెళ్లి చేసుకుని.. 2012లో అతని నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం పీటర్ పాల్ అనే వ్యక్తిని అక్టోబర్ 2020లో వివాహం చేసుకొని పరస్పర అంగీకారంతో అతనితో విడాకులు తీసుకుంది. గత కొంతకాలంగా వనితా నాలుగో పెళ్లిపై కూడా వార్తలొస్తుండగా ఇప్పుడు ఈ ఫోటో తానే పోస్ట్ చేయడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.