BiggBoss 6 Day 60 : నిన్న కర్రలతో.. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా కొట్టుకోవడమే.. మళ్ళీ సూర్యపై ప్రేమని చూపిస్తున్న ఇనయా..

బిగ్‌బాస్ సీజన్ 6 మరింత ఆసక్తిగా సాగుతోంది. కెప్టెన్సీ టాస్క్ లో ఈ సారి అన్ని ఫిజికల్ టాస్కులే ఇస్తున్నాడు బిగ్‌బాస్. గత ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ని రెండు టీంలుగా విడగొట్టి కర్రలు ఇచ్చి కొట్టుకోమన్నాడు. గురువారం ఎపిసోడ్ లో ఏకంగా డైరెక్ట్ గా కొట్టేసుకున్నారు. గురువారం ఎపిసోడ్ లో.....................

BiggBoss 6 Day 60 : నిన్న కర్రలతో.. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా కొట్టుకోవడమే.. మళ్ళీ సూర్యపై ప్రేమని చూపిస్తున్న ఇనయా..

BiggBoss 6 Day 60 fight between contestants

BiggBoss 6 Day 60 :  బిగ్‌బాస్ సీజన్ 6 మరింత ఆసక్తిగా సాగుతోంది. కెప్టెన్సీ టాస్క్ లో ఈ సారి అన్ని ఫిజికల్ టాస్కులే ఇస్తున్నాడు బిగ్‌బాస్. గత ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ని రెండు టీంలుగా విడగొట్టి కర్రలు ఇచ్చి కొట్టుకోమన్నాడు. గురువారం ఎపిసోడ్ లో ఏకంగా డైరెక్ట్ గా కొట్టేసుకున్నారు. గురువారం ఎపిసోడ్ లో ముందుగా మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ అని ఆకాశంలోంచి గ్రానైట్స్ పడతాయి. వాటిని ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తే ఆ టీం విన్ అయినట్టు. ఈ టాస్క్ లో ఒకరి మీద ఒకరు పడిపోయి మరీ, ఒకరి దగ్గర్నుంచి ఒకరు లాక్కొని హౌజ్ లో నానా హంగామా చేశారు.

ఆ తర్వాత గత ఎపిసోడ్ లో ఆదిరెడ్డికి సీక్రెట్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆదిరెడ్డి తన టీంతో కలిసి బాత్రూంని డర్టీగా మార్చాడు. ఈ విషయంలో రెండు గ్రూపుల మధ్య కాసేపు గొడవ జరిగింది. రాత్రి పూట గీతూ ఆదిరెడ్డి షర్ట్ ని దొంగిలించింది. దీంతో ఆదిరెడ్డి అడిగితే నాకు తెలీదు అంది. ఒకవేళ గీతూనే తీస్తే రేపట్నుంచి ఆదిరెడ్డి వర్సెస్ గీతూ ఉంటుంది ఆట అన్నాడు.

BiggBoss 6 Day 59 : ఈ సారి ఏకంగా కంటెస్టెంట్స్‌కి కర్రలు ఇచ్చి కొట్టుకోమన్న బిగ్‌బాస్

మధ్యలో ఇనయా కాసేపు ఓవరాక్షన్ చేసింది. తినేముందు ఫైమాకి ఆకలి లేదు, తినను అని చెప్పింది. మళ్ళీ తినే సమయానికి వచ్చి సూర్య ప్లేట్ కనపడలేదు, నేను దాంట్లో తింటున్నాను అని తెలుసు కదా అని హడావిడి చేసింది. సూర్య ప్లేట్ లేకపోతే నేను తినను అని మారాం చేసింది. కొంతమంది సెటైర్స్ వేస్తే కీర్తి, వాసంతిలు తినిపించడానికి ట్రై చేశారు. సూర్య మీద అంత ప్రేమ ఉంటే సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోయి సూర్య వాళ్ళింట్లో కూర్చో అని శ్రీసత్య కౌంటర్ ఇచ్చింది. శ్రీహాన్ కూడా ముందేమో ఆకలి లేదు తినను అని ఇప్పుడేమో సూర్య ప్లేట్ లేదు తినను అంటున్నావు, డ్రామాలు చేస్తున్నావు అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక చివర్లో బ్లూ, రెడ్ టీమ్స్ డైరెక్ట్ గా కొట్టుకున్నారు. దీంట్లో రేవంత్ కంటికి గాయమైంది. మరి ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారో నేటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.