BiggBoss 6 Day 61 : బిగ్‌బాస్‌‌లో కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా??

 బిగ్‌బాస్‌‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రెండు టీమ్స్ గా కంటెస్టెంట్స్ ని విడకొట్టి రకరకాల టాస్కులు ఇస్తున్నారు. కంటెస్టెంట్స్ అంతా టీమ్స్ గానే ఆడుతున్నారు. కానీ గీతూ మాత్రం సొంతంగా రూల్స్ ఫాలో అవ్వకుండా................

BiggBoss 6 Day 61 : బిగ్‌బాస్‌‌లో కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా??

BiggBoss 6 Day 61 new captain in BiggBoss House

BiggBoss 6 Day 61 :  బిగ్‌బాస్‌‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రెండు టీమ్స్ గా కంటెస్టెంట్స్ ని విడకొట్టి రకరకాల టాస్కులు ఇస్తున్నారు. కంటెస్టెంట్స్ అంతా టీమ్స్ గానే ఆడుతున్నారు. కానీ గీతూ మాత్రం సొంతంగా రూల్స్ ఫాలో అవ్వకుండా తనకిష్టమొచ్చినట్టు ఆడుతుంది. గీతూ గత ఎపిసోడ్ లో ఆదిరెడ్డి టిషర్ట్ ని కొట్టేసింది. గీతూ గేమ్ లో లేకపోయినా ఆదిరెడ్డి షర్ట్ కొట్టేయడంతో ఆదిరెడ్డి ఫైర్ అయ్యాడు. గేమ్ పక్కన పెట్టి పర్సనల్ గా ఆడుతున్నావంటూ ఫైర్ అయ్యాడు.

దీనిపై కాసేపు గీతూ, ఆదిరెడ్డి మధ్య వివాదం జరిగింది. ఎప్పటిలాగే గీతూ నా ఇష్టం అంటూ రెచ్చిపోయింది. ఆదిరెడ్డి.. నువ్వు రూల్స్ ఫాలో అవ్వకుండా ఆడుతున్నావు ఏదో ఒకరోజు ఏడుస్తావు నా వల్ల అని ఫైర్ అయ్యాడు. దీంతో వీరిద్దరూ మాట్లాడటం మానేశారు. ఇక కంటెస్టెంట్స్ డైరెక్ట్ గా కొట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇనయా అవతల టీం వాళ్ళని కొట్టడానికి ట్రై చేయగా రేవంత్ ఆమెని పడేశాడు. దీంతో ఇనయా ఏడుస్తూ అందరూ నన్ను కావాలని టార్గెట్ చేశారు అని కాసేపు అరిచింది. ఈమె అరుపులకి ఎప్పటిలాగే శ్రీహన్ కౌంటర్లు వేశాడు.

ఇక బిగ్‌బాస్‌‌ కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ గీతూ చేసింది తప్పని క్లాస్ పీకాడు. అలాగే ఆదిరెడ్డిని కూడా కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించాడు. దీంతో గీతూ ఆదిరెడ్డికి సారీ చెప్పింది. అయినా ఆదిరెడ్డి గీతూని మాత్రం వదిలేది లేదన్నాడు. ఇక మిషన్ ఇంపాజిబుల్ అనే టాస్క్ లో రెండు టీమ్స్ ఈక్వల్ స్కోర్ చేయగా టై అవ్వడంతో ఫైనల్ టాస్క్ పోటీకి ఎవర్ని పంపిస్తారో మీరే తేల్చుకోండి అని రెండు గ్రూపులకి చెప్పాడు బిగ్‌బాస్‌‌. దీంతో రెండు టీంల నుంచి శ్రీసత్య, ఇనయ, మెరీనా, ఫైమా, వాసంతి, గీతూలు ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు.

BiggBoss 6 Day 60 : నిన్న కర్రలతో.. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా కొట్టుకోవడమే.. మళ్ళీ సూర్యపై ప్రేమని చూపిస్తున్న ఇనయా..

చివరిగా ఒక్కొక్కరికి బెలూన్ ఇచ్చి మీ బెలూన్ కాపాడుకుంటూ అవతలి వాళ్ళ బెలూన్ ని పగలకొట్టాలి అని చెప్పారు. దీంతో ఇది కూడా ఫిజికల్ టాస్క్ గా మారింది. అమ్మాయిలంతా అవతలి వాళ్ళ బెలూన్ ని పగలకొట్టడానికి కొట్టుకున్నారు. చివరిగా ఈ టాస్క్ లో శ్రీసత్య గెలిచి ఈ వారం కెప్టెన్ గా నిలిచింది.