BiggBoss 6 Day 62 : గీతూ, శ్రీహాన్, రేవంత్, ఇనయాలపై ఫైర్ అయిన నాగార్జున.. వీకెండ్ ఎపిసోడ్ సీరియస్ మోడ్..

 బిగ్‌బాస్ వీకెండ్ శనివారం ఎపిసోడ్ లో వారమంతా కంటెస్టెంట్స్ చేసిన విషయాలపై నాగార్జున ఫైర్ అవుతారని తెలిసిందే. ఈ వారం కూడా ఇంటి సభ్యులపై మరింత ఫైర్ అయ్యారు నాగార్జున. మొదట ఈ వారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌లో..........

BiggBoss 6 Day 62 : గీతూ, శ్రీహాన్, రేవంత్, ఇనయాలపై ఫైర్ అయిన నాగార్జున.. వీకెండ్ ఎపిసోడ్ సీరియస్ మోడ్..

BiggBoss 6 Day 62 :  బిగ్‌బాస్ వీకెండ్ శనివారం ఎపిసోడ్ లో వారమంతా కంటెస్టెంట్స్ చేసిన విషయాలపై నాగార్జున ఫైర్ అవుతారని తెలిసిందే. ఈ వారం కూడా ఇంటి సభ్యులపై మరింత ఫైర్ అయ్యారు నాగార్జున. మొదట ఈ వారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌లో రెడ్‌, బ్లూ టీమ్‌ మెంబర్స్‌కు ర్యాంకులివ్వమని ఆ టీం హెడ్స్ గా చేసిన గీతూ, ఆదిరెడ్డిలకు చెప్పాడు నాగార్జున.

బ్లూ టీమ్‌ లీడర్‌ ఆదిరెడ్డి.. రాజ్‌ కి ఫస్ట్‌, ఇనయాకి సెకండ్‌, మెరీనా, వాసంతి, బాలాదిత్య, రోహిత్‌లకు వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు ర్యాంక్స్ ఇచ్చాడు. తనకు మాత్రం ఏడో ర్యాంక్ ఇచ్చుకున్నాడు. ఇక గీతూ తన రెడ్ టీంలో శ్రీహాన్‌కు ఫస్ట్‌, ఫైమాకు సెకండ్‌, శ్రీసత్య, రేవంత్‌ లకు మూడు, నాలుగు ర్యాంక్స్ ఇచ్చింది. తనకి ఐదో ర్యాంక్ ఇచ్చుకుంది. కీర్తికి ఆరో ర్యాంకు ఇచ్చింది.

సిగరెట్ విషయంలో బాలాదిత్య, గీతూ మధ్య జరిగిన గొడవ గురించి ప్రస్తావిస్తూ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు. గీతూ రూల్స్ కూడా వదిలేసి తనకిష్టమొచ్చినట్టు ఆడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై నాగార్జున చాలా సీరియస్ అయ్యాడు. రేవంత్ ప్రతిదానికి గొడవపడటం, కొట్టుకోవడం దాకా వెళ్తున్నాడని ఓ వీడియో చూపించి కోపం తగ్గిన్చుకోవాలి, ఇది మళ్ళీ రిపీట్ అయితే డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతావు అని వార్నింగ్ ఇచ్చాడు నాగ్.

కొత్త కెప్టెన్ శ్రీసత్యకి కంగ్రాట్స్ చెప్పాడు. పాత కెప్టెన్ శ్రీహాన్‌ను కెప్టెన్సీలో నువ్వేం పొడిచావో చెప్పు అనడంతో శ్రీహాన్ ఏం మాట్లాడలేదు. కొన్ని గీతూకి సంబంధించిన వీడియోలు చూపించి ఇంటి సభ్యులు తప్పు చేస్తున్నా నువ్వు ఊరుకున్నావు ఇందుకు వచ్చేవారం నువ్వు కెప్టెన్సీ పోటీకి అనర్హుడివి అని నాగార్జున ప్రకటించాడు. గీతూ వల్లే ఈ ఎపిసోడ్ లో చాలా మందికి కౌంటర్లు పడ్డాయి నాగ్ చేతిలో. ఇక ఈ వారం ఆదిరెడ్డి, గీతూలు వరస్ట్‌ పర్ఫామర్‌ ట్యాగ్స్ అందుకున్నారు.

BiggBoss 6 Day 61 : బిగ్‌బాస్‌‌లో కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా??

ఇంటి సభ్యులు ఫుడ్ వేస్ట్ చేస్తున్న వీడియోని చూపించి ఫుడ్ సరిపోకపోవడం మీ తప్పే అని అందరికి వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయంలో ఇనయాకి సపరేట్ వార్నింగ్ ఇచ్చాడు. అలాగే కెప్టెన్సీ టాస్క్ సమయంలో శ్రీసత్య, శ్రీహన్ గురించి తప్పుగా మాట్లాడటంతో ఇనయాకి గట్టిగానే క్లాస్ పీకాడు నాగ్. ఇనయా కవర్ చేయాలనీ ట్రై చేసినా, ఎంత కవర్ చేసినా దొరికిపోయావ్ అంటూ కౌంటర్ ఇచ్చాడు నాగార్జున.

ఈ వారం నామినేషన్స్ లో రేవంత్, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, కీర్తి, శ్రీసత్య, ఇనయా, రోహిత్, మెరీనా, ఫైమాలు ఉండగా ఇందులో ఆదిరెడ్డి, కీర్తి, రేవంత్‌ సేఫ్‌ అయినట్లు నాగార్జున ఈ ఎపిసోడ్ లోనే ప్రకటించాడు. దీంతో ఆదివారం ఎపిసోడ్ లో మిగిలిన వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ఆసక్తిగా చూస్తున్నారు ప్రేక్షకులు.