BiggBoss 6 Day 64 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరో తెలుసా?? అందరూ కలిసి ఇనయాని టార్గెట్ చేశారుగా..

ఈ వారం అందరూ కలిసి ఇనయాని నామినేట్ టార్గెట్ చేశారు. గేమ్ ఆడకుండా సూర్య అని హడావిడి చేయడం, టీమ్స్ గా విడగొట్టినప్పుడు సొంత టీం వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఆడటంతో అందరూ కలిసి ఈ వారం ఇనయాని.......................

BiggBoss 6 Day 64 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరో తెలుసా?? అందరూ కలిసి ఇనయాని టార్గెట్ చేశారుగా..

BiggBoss 6 Day 64 nominations day

BiggBoss 6 Day 64 :  బిగ్‌బాస్‌ గత రెండు వారాల నుంచి చాలా సీరియస్ గా సాగుతోంది. ఆదివారం ఎపిసోడ్ లో గీతూని ఎలిమినేట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు బిగ్‌బాస్‌. అయితే గీతూ వెళ్లిపోవడంతో అటు కంటెస్టెంట్స్, ఇటు ప్రేక్షకులు చాలా మంది హ్యాపీగానే ఫీల్ అయ్యారు. అసలు ఎవరిమాట, ఏకంగా బిగ్‌బాస్‌ మాట కూడా వినకుండా, ఓవర్ యాక్షన్, యాటిట్యూడ్ చూపించే గీతూని అందరూ వెళ్లిపోవాలని అనుకున్నారు. అందరితో గొడవలు పెట్టుకునే గీతూ వెళ్లిపోయిన తర్వాత బిగ్‌బాస్‌ ఎలా ఉంటుందో చూడాలి మరి.

ఇక ఎప్పటిలాగే సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ సాగింది. ఈసారి నామినేట్ చేయాలనుకున్న వాళ్ళ ముఖంపై అక్కడ ఏర్పాటు చేసిన రంగు నీళ్లు పోసి ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పమన్నాడు బిగ్‌బాస్‌. మొదట ఈ వారం కెప్టెన్ గా ఉన్న శ్రీసత్యని నామినేషన్స్ ప్రక్రియని మొదలుపెట్టమన్నాడు.

శ్రీసత్య.. బాలాదిత్య, ఇనయాలని నామినేట్ చేసింది. గత వారం ఇనయా.. శ్రీసత్య, శ్రీహాన్ ల గురించి తప్పుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై గొడవ పెట్టుకొని ఇనయాని నామినేట్ చేసింది. ఆదిరెడ్డి.. ఇనయని, రేవంత్‌ ని నామినేట్ చేశాడు. దీంతో ఇనయాకి, ఆదిరెడ్డికి కూడా గట్టిగానే గొడవ అయింది. రేవంత్ ఫిజికల్ టాస్క్ లో అందర్నీ కొట్టాడని, తోసేశాడని నామినేట్ చేయగా నీకు ఆడే దమ్ము లేదు అంటూ రేవంత్ రెచ్చిపోయాడు. వాసంతి.. ఇనయా, ఆదిరెడ్డిలని నామినేట్ చేసింది. రేవంత్‌.. వాసంతి, ఆదిరెడ్డిలని నామినేట్ చేశాడు. కీర్తి.. శ్రీహాన్‌, ఇనయాలని నామినేట్ చేసింది. బాలాదిత్య.. శ్రీహాన్‌, ఇనయాలని నామినేట్ చేశాడు. మెరీనా.. ఆదిరెడ్డి, ఇనయాలని నామినేట్ చేసింది. రాజ్‌.. ఇనయా, శ్రీహాన్‌ లని నామినేట్ చేశాడు. రోహిత్‌.. రేవంత్‌, ఆదిరెడ్డిలని నామినేట్ చేశాడు. ఫైమా.. వాసంతి, మెరీనాలని, శ్రీహాన్‌.. కీర్తి, ఇనయాలని, ఇనయా.. ఫైమా, శ్రీహాన్‌లను నామినేట్‌ చేసింది. గత వారం ఇనయా ఫైమాని ఫ్రెండ్ అంటూనే వెన్నుపోటు పొడిచింది దీంతో ఈ ఇద్దరి మధ్య పెద్ద గొడవే అయింది.

ఈ వారం అందరూ కలిసి ఇనయాని నామినేట్ టార్గెట్ చేశారు. గేమ్ ఆడకుండా సూర్య అని హడావిడి చేయడం, టీమ్స్ గా విడగొట్టినప్పుడు సొంత టీం వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఆడటంతో అందరూ కలిసి ఈ వారం ఇనయాని టార్గెట్ చేశారు. దీంతో అత్యధికంగా నామినేషన్స్ ఇనాయాకి వచ్చాయి. ఇక ఇనయా అందరితో గొడవ పెట్టుకుంది.

BiggBoss 6 Day 63 : మొత్తానికి గీతూ ఎలిమినేట్ అయిందిగా.. ఇనయాకి కౌంటర్ ఇచ్చిన నాగ్..

ఒకపక్క నామినేషన్స్‌ జరుగుతుంటే శ్రీహాన్‌, శ్రీసత్య, రేవంత్‌ కామెడీ చేసుకుంటుంటే బిగ్‌బాస్‌ సీరియస్ అయ్యాడు. శ్రీసత్యకి కెప్టెన్ అయి ఉండి కూడా ఇలా చేస్తావా అని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో శ్రీసత్య బిగ్‌బాస్‌ కి సారీ చెప్పింది. మొత్తంగా పదో వారంలో ఇంటిలో 12 మంది మిగలగా బాలాదిత్య, మెరీనా, కీర్తి, ఫైమా, వాసంతి, రేవంత్‌, ఆదిరెడ్డి, శ్రీహాన్‌, ఇనయాలు నామినేట్‌ అయ్యారు. మరి ఈ వారం వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.