BiggBoss 6 Day 79 : ఇంటి సభ్యులని హౌజ్‌లోకి పంపి సర్‌ప్రైజ్ చేసిన బిగ్‌బాస్.. ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్..

 బిగ్‌బాస్ చివరి స్టేజిలో ఉంది ఎప్పట్లాగే చివర్లో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని పంపి ఆశ్చర్యపరిచాడు బిగ్‌బాస్. మంగళవారం ఎపిసోడ్ లో మొదట బిగ్‌బాస్..............

BiggBoss 6 Day 79 : ఇంటి సభ్యులని హౌజ్‌లోకి పంపి సర్‌ప్రైజ్ చేసిన బిగ్‌బాస్.. ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్..

BiggBoss 6 Day 79 :  బిగ్‌బాస్ చివరి స్టేజిలో ఉంది ఎప్పట్లాగే చివర్లో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని పంపి ఆశ్చర్యపరిచాడు బిగ్‌బాస్. మంగళవారం ఎపిసోడ్ లో మొదట బిగ్‌బాస్ కోచింగ్ సెంటర్ నడిపించమని టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఫైమా ఇంగ్లీష్‌ టీచర్‌, ఆదిరెడ్డి డాన్సింగ్ టీచర్, శ్రీ సత్య మేకప్‌ టీచర్‌, రాజ్‌ సింగింగ్‌ టీచర్‌ కాగా మిగిలిన వాళ్ళని స్టూడెంట్స్ గా చేయమన్నారు ఈ టాస్క్ ఆద్యంతం కామెడీగా సాగింది.

ఈ టాస్క్ అనంతరం ఆదిరెడ్డి భార్య కవిత, కూతురుని ఇంట్లోకి పంపించి సర్‌ప్రైజ్‌ చేశారు బిగ్‌బాస్ . దీంతో భార్యని, కూతురుని చూసి ఫుల్ ఆనందించాడు ఆదిరెడ్డి. తన భార్యతో సరదాగా కబుర్లు చెప్పాడు. తన కూతురితో ఆడుకున్నాడు. తన కూతురి మొదటి పుట్టినరోజుకి బిగ్‌బాస్ లోనే ఉండటంతో బిగ్‌బాస్ కేక్ పంపించి ఆదిరెడ్డి కూతురి పుట్టిన రోజుని సెలబ్రేట్ చేశాడు. ఆదిరెడ్డి భార్య అందరితో కలిసిపోయి చక్కగా మాట్లాడింది, కౌంటర్లు కూడా వేసింది. ఒక కామన్ మ్యాన్ గా బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇన్ని వారాలు కొనసాగి, నా ఫ్యామిలీని కూడా బిగ్‌బాస్ లో చూపించారు ఇంతకంటే ఏం కావాలి అని సంతోషించాడు ఆదిరెడ్డి.

BiggBoss 6 Day 78 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరున్నారంటే..?

ఆ తర్వాత రాజ్ వాళ్ళ అమ్మ బిగ్‌బాస్ హౌజ్ లోకి వచ్చింది. దీంతో రాజ్ ఎమోషనల్ అయ్యాడు. రాజ్ వాళ్ళ అమ్మ కూడా అందర్నీ అభినందించింది. చాలా ఆనందంగా ఉందని తెలిపింది. నేటి ఎపిసోడ్ లో మరికొంతమంది కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఫ్యామిలీస్ రాని వాళ్ళు తమ ఫ్యామిలీలని తలుచుకొని బాధపడ్డారు.