BiggBoss 6 Day 83 : కంటెస్టెంట్స్ కోసం వచ్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్..
ఈ వారం అంతా హౌజ్ లో కంటెస్టెంట్స్ కోసం ఫ్యామిలీ మెంబర్స్ ని హౌజ్ లోకి పంపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం ఎపిసోడ్స్ అన్ని ఎమోషనల్ గా సాగాయి. ఇక వీకెండ్ శనివారం ఎపిసోడ్ లో కూడా...............

BiggBoss 6 Day 83 : ఈ వారం అంతా హౌజ్ లో కంటెస్టెంట్స్ కోసం ఫ్యామిలీ మెంబర్స్ ని హౌజ్ లోకి పంపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం ఎపిసోడ్స్ అన్ని ఎమోషనల్ గా సాగాయి. ఇక వీకెండ్ శనివారం ఎపిసోడ్ లో కూడా కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వచ్చారు. అయితే ఈ సారి వాళ్ళని హౌజ్ లోకి పంపకుండా స్టేజి మీద నుంచే మాట్లాడిచ్చారు. అలాగే కంటెస్టెంట్స్ కోసం వచ్చిన వాళ్ళని హౌజ్ లో వారికి ఎవరు పోటీ, ఎవరు కాదు చెప్పమన్నాడు నాగార్జున.
మొదటగా ఇనయా కోసం ఆమె తమ్ముడు, మాజీ కంటెస్టెంట్ సోహైల్ వచ్చారు. ఇనయా తమ్ముడు.. ఇనయను, ఆమె తల్లిని కలిపినందుకు బిగ్ బాస్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక సోహైల్ ఫినాలేలో డబ్బు ఆఫర్ చేస్తే తనలా సూట్‌కేస్ తీసుకోమని వచ్చేయమని సలహా ఇచ్చాడు. సోహైల్ కి, ఇనయాకి ఉన్న జిమ్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పాడు సోహైల్. ఇనయకు హౌస్‌లో రేవంత్ పోటీ అని, ఆదిరెడ్డి అసలు పోటీ కాదని అన్నాడు.
ఆ తర్వాత శ్రీహాన్ కోసం అతడి తండ్రి, శివబాలాజీ వచ్చారు. శివబాలాజీ.. రేవంత్ గురించి మాట్లాడుతూ నేను బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక లోపల జరిగేదంతా నిజమేనా అని అడిగితే అవునను చెప్పాను, అయితే అస్సలు వెళ్ళాను అన్నాడు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నాడు అని చెప్పాడు. ఇక శ్రీహన్ తండ్రి శ్రీహన్ లవ్ స్టోరీ గురించి చెప్పాడు.
ఇక ఫైమా కోసం తన అక్క సల్మా, అలాగే బుల్లెట్ భాస్కర్ వచ్చారు. అక్కని చూడగానే ఫైమా ఏడ్చేసింది. పెళ్లి గురించి టాపిక్ రాగా ఫైమా మాట్లాడుతూ.. అమ్మ వాళ్లకు సొంతిల్లు కట్టించి, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాకే తాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఇక భాస్కర్ తన పంచులతో అందర్నీ నవ్వించాడు. ఫైమాకు ఇనయా గట్టి పోటీ ఇస్తుందని, శ్రీసత్య పోటీనే కాదని చెప్పాడు.
రేవంత్ కోసం వాళ్ళ అన్నయ్య సంతోష్, స్నేహితుడు రోల్ రైడా వచ్చారు. తన తమ్ముడికి శ్రీహాన్ పోటీ అని, రోహిత్ అసలు పోటీనే కాదని సంతోష్ చెప్పాడు. రోల్ రైడా, రేవంత్ తన స్నేహం గురించి మాట్లాడారు.
రోహిత్ కోసం అతడి తమ్ముడు డింప్, నటుడు ప్రభాకర్ వచ్చారు. రోహిత్‌కు రేవంత్ పోటీ అని, రాజ్ పోటీ కాదని చెప్పాడు ప్రభాకర్. అలాగే రేవంత్‌ను గెలిస్తే టైటిల్ గెలవడం ఈజీ అని అన్నాడు.
ఆదిరెడ్డి కోసం చెల్లెలు నాగలక్ష్మి, మాజీ కంటెస్టెంట్ లహరి వచ్చారు. నాగలక్ష్మి అంధురాలు కావడంతో నిన్ను చూడలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయింది. ఆదిరెడ్డి మాట్లాడుతూ.. నేను ఖాళీగా ఉన్న టైంలో మా కుటుంబమంతా చెల్లెలు పెన్షన్‌తోనే బతికాం అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు.
ఇక శ్రీసత్య కోసం తన బెస్ట్‌ఫ్రెండ్ హారిక, నటి విష్ణుప్రియ వచ్చారు. హారిక మాట్లాడుతూ.. శ్రీసత్య చేసే అల్లరి పనులు అన్ని చెప్పింది. అలాగే తన తల్లికి రెగ్యులర్ గా ట్రీట్మెంట్ జరుగుతుందని, కంగారు పడొద్దని చెప్పింది. శ్రీసత్యకి రేవంత్ పోటీ అని, కీర్తి పోటీ కాదని తెలిపింది.
రాజ్ కోసం అతని ఫ్రెండ్ వెంకీ, హీరో సాయిరోనక్ వచ్చి మాట్లాడారు. రాజ్‌కు ఆటలో రేవంత్ కాంపిటీషన్ అని, ఇనయా పోటీనే కాదని చెప్పారు.
BiggBoss 6 Day 82 : బిగ్‌బాస్ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా..?
అనంతరం కీర్తి కోసం ప్రియాంక, వితికా షేరు వచ్చారు. వితికా మాట్లాడుతూ.. నీకు ఎవరూ లేరని బాధపడుతున్నావు, కానీ బయట చాలామంది నిన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు అని చెప్పింది. ఇక కీర్తికి హౌజ్ లో శ్రీహాన్ పోటీ అని, శ్రీసత్య పోటీ కాదని చెప్పారు. ఇక నేటి ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.