BiggBoss 6 Day 84 : ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా??

ఈ వారం అంతా కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ తోనే ఎమోషనల్ గా గేమ్ సాగించాడు బిగ్‌బాస్. ఇక వీకెండ్ లో నాగార్జున ఈ సారి కంటెస్టెంట్స్ మీద ఫైర్ అవ్వకుండా ఒకరి తప్పులని ఇంకొకరితో చెప్పించాడు. హౌజ్ మేట్స్ లో ఎవరైనా............

BiggBoss 6 Day 84 : ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా??

BiggBoss 6 Day 84 raj eliminated from house

BiggBoss 6 Day 84 : ఈ వారం అంతా కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ తోనే ఎమోషనల్ గా గేమ్ సాగించాడు బిగ్‌బాస్. ఇక వీకెండ్ లో నాగార్జున ఈ సారి కంటెస్టెంట్స్ మీద ఫైర్ అవ్వకుండా ఒకరి తప్పులని ఇంకొకరితో చెప్పించాడు. హౌజ్ మేట్స్ లో ఎవరైనా ఒక నలుగురివి వారిలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ని చెప్పమన్నాడు నాగ్. మొదట రోహిత్‌ మాట్లాడుతూ.. కీర్తి ఎక్కువగా బాధపడుతుంది, ఫైమా, శ్రీసత్యలలో వెటకారం ఎక్కువ. ఇనయా ఎవరికీ అవకాశమివ్వకుండా మాట్లాడుతుంది, రాజ్‌ పాయింట్‌ లేకున్నా అరుస్తాడు, రేవంత్‌కు కోపమెక్కువ. ఇక శ్రీహాన్‌ గేమ్‌ కన్నా ఫ్రెండ్‌షిప్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు అని చెప్పాడు.

ఇనయా మాట్లాడుతూ.. శ్రీసత్య గేమ్‌ను లైట్‌గా తీసుకుంటుంది, రేవంత్‌ ఎక్కువగా కన్ఫ్యూజన్‌ అవుతాడు. రాజ్ ప్రతిదానికి నేనున్నానని చూపించుకోవడానికి అరుస్తాడు. ఆదిరెడ్డి గేమ్ ఆడకుండా కూర్చోవడం కరెక్ట్‌ కాదు అని చెప్పింది.

కీర్తి.. రేవంత్‌ కి కోపం బాగా ఎక్కువ. శ్రీసత్య, శ్రీహాన్‌ లకి వెటకారం ఎక్కువ, రోహిత్‌ ఎవరితోనూ కలవడు అని చెప్పింది.

ఆదిరెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌ ఆడినా నేను ఆడాను అని నిరూపించుకోవడానికి ట్రై చేస్తాడు. ఇనయా ఇష్టమొచ్చినట్టు మాట్లాడేస్తుంది. శ్రీసత్యకు కాన్ఫిడెన్స్‌ లేదు. రోహిత్‌ అస్సలు మాట్లాడడు అని చెప్పాడు.

ఫైమా.. రేవంత్ కి కోపం ఎక్కువ, ఇనయాకి సరిగ్గా మాట్లాడటం రాదు. రోహిత్‌ పర్ఫామెన్స్‌ గేమ్ లో కనిపించట్లేదు. కీర్తి ప్రతిదానికి ఎమోషనల్‌ అవుతుంది అని చెప్పింది.

శ్రీసత్య.. రోహిత్‌ రియాక్ట్ అవ్వాల్సిన టైమ్‌కు రియాక్ట్‌ అవ్వడు. కీర్తి ఏం చెప్పినా వినిపించుకోదు. ఇనయా ఎదుటివాళ్లకు మాట్లాడే ఛాన్స్‌ ఇవ్వదు. శ్రీహాన్‌ గేమ్‌ కన్నా ఫ్రెండ్‌షిప్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు అని చెప్పింది.

రాజ్‌ మాట్లాడుతూ.. రోహిత్‌ గట్టిగా మాట్లాడడు. ఇనయ ప్రతిదానిలో దూరుతుంది. శ్రీహాన్‌ గేమ్‌ కన్నా స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. శ్రీసత్య నామినేషన్‌లో ఏదో చెప్పేసి వెళ్ళిపోతుంది అని అన్నాడు.

శ్రీహాన్‌.. రాజ్‌కు కాన్ఫిడెన్స్‌ తక్కువ. రోహిత్‌ మంచితనం అన్నిచోట్లా పనికిరాదు. రేవంత్‌ ఏది పడితే అది మాట్లాడతాడు. శ్రీసత్య వేరేవాళ్ల మాట నమ్మి ఫ్రెండ్‌ను దూరం పెడుతుంది అని చెప్పాడు.

రేవంత్‌.. ఫైమా ఇంకా వెటకారం తగ్గించుకోలేదని, ఆదిరెడ్డి మానిప్యులేటర్‌ అని, ఇనయ, కీర్తి కావాలని రెచ్చగొడుతారని చెప్పాడు.

ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు నాగ్. అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించాడు. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివరికి ఫైమా, రాజ్ మిగిలారు. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ పాస్ ఉండటంతో అది నువ్వు వాడుకుంటావా, రాజ్ కి ఇస్తావా అని అడిగాడు నాగ్. బాగా ఆలోచించి రాజ్ కి ఇస్తానంది. ఒకవేళ నువ్వు ఎలిమినేట్ అయితే అని ప్రశ్నించాడు నాగ్. దీంతో మళ్ళీ ఆలోచనలో పడేసరికి రాజ్.. పర్లేదు నీ కోసం వాడుకో ఎవిక్షన్ పాస్ అని ఫైమాకి చెప్పాడు. రాజ్ చెప్పడంతో ఫైమా ఎవిక్షన్ పాస్ తన కోసం వాడుకుంది. దీంతో హౌజ్ నుంచి రాజ్ ఎలిమినేట్ అయ్యాడు.

BiggBoss 6 Day 83 : కంటెస్టెంట్స్ కోసం వచ్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్..

ఇక స్టేజీ మీదకు వచ్చిన రాజ్‌తో పంచ్‌, హగ్స్‌ ఎవరికీ ఇస్తావు హౌజ్ లో అని నాగ్ అడగడంతో.. ఫైమా, ఆది, రోహిత్‌, రేవంత్‌కు హగ్స్‌ ఇస్తానని, ఇనయా, కీర్తి, శ్రీహన్, శ్రీసత్యలకి పంచ్ ఇస్తానని చెప్పాడు. అనంతరం కంటెస్టెంట్స్ కి సూచనలు ఇచ్చి వెళ్ళిపోయాడు. మొత్తానికి ఈ వారం రాజ్ ఎలిమినేట్ అవ్వగా హౌజ్ లో ఇంకో నలుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. మరో రెండువారాలకి పైగా గేమ్ ఉంది.