BiggBoss 6 Day 85 : ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారో తెలుసా ?
బిగ్‌బాస్ సీజన్ 6 దాదాపు చివరి దశకి వచ్చేసింది. ఇరవై ఒక్క మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ ఇప్పుడు హౌజ్ లో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఆదివారం రాజ్ ఎలిమినేషన్ తర్వాత సోమవారం నాడు ఎప్పటిలాగే..................

BiggBoss 6 Day 85 nominations day
BiggBoss 6 Day 85 : బిగ్‌బాస్ సీజన్ 6 దాదాపు చివరి దశకి వచ్చేసింది. ఇరవై ఒక్క మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ ఇప్పుడు హౌజ్ లో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఆదివారం రాజ్ ఎలిమినేషన్ తర్వాత సోమవారం నాడు ఎప్పటిలాగే నామినేషన్స్ జరిగాయి. సీజన్ చివరికి వస్తుండటంతో ఈ వారం నామినేషన్స్ మరింత ఘాటుగా జరిగాయి.
ఈ వారం ఇనయా కెప్టెన్‌గా ఉండటంతో ఆమె నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. ఇక నామినేషన్స్ లో అందరూ రేవంత్, ఆదిరెడ్డిలని టార్గెట్ చేశారు. గతంలో కంటే ఈ వారం నామినేట్ చేసేటప్పుడు గొడవలు ఎక్కువగా పెట్టుకొని ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. రంగు చాల్లే మిషన్ ఒకటి పెట్టి ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారిపై ఆ మిషన్ తో రంగు చల్లమన్నాడు బిగ్‌బాస్.
BiggBoss 6 Day 84 : ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా??
ఈ వారం ఆదిరెడ్డి.. రేవంత్, రోహిత్ లని నామినేట్ చేశాడు. ఫైమా.. రేవంత్, రోహిత్ లని, శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డి లని, కీర్తి.. రేవంత్, శ్రీసత్యలని, శ్రీసత్య.. కీర్తి, ఆదిరెడ్డిలని, రోహిత్.. ఆది రెడ్డి, ఫైమాలని, రేవంత్.. ఆది రెడ్డి, ఫైమాలని, ఇనయా.. రేవంత్, శ్రీసత్యలని నామినేట్ చేశారు. మొత్తంగా ఈ వారం ఫైమా, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్, కీర్తి నామినేషన్స్ లో ఉన్నారు. శ్రీహాన్, ఇనయా ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. మరి వారం చివర్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.