ఓపీటీ రద్దుకోసం అమెరికాలో బిల్లు..చదువు పూర్తయ్యాక వెళ్ళిపోవాల్సిందేనా?

ఈనేపధ్యంలో ఓపీటీని తొలగించమంటూ ఫెయిర్ నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ పేరుతో ప్రతినిధుల సభలో బిలు ప్రవేశపెట్టారు.

10TV Telugu News

US:చదువుకోవటం కోసం అమెరికా వెళ్ళి, చదువు పూర్తయిన తరువాత అక్కడే ఉండి ఉద్యోగం వెతుకుంటూ జీవితంలో సెటిలవ్వటానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం ఈ విధానాన్ని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. విదేశీ విద్యార్ధులకు చదవు తరువాత ఉద్యోగం వెతుక్కోవటానికి అనుకూలంగా ఉన్న అప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ (ఓపీటీ)ని రద్దు చేయాలన్న డిమాండ్లు గత కొంతకాలంగా వెల్లవెత్తుతున్నాయి.

ఈనేపధ్యంలో ఓపీటీని తొలగించమంటూ ఫెయిర్ నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ పేరుతో ప్రతినిధుల సభలో బిలు ప్రవేశపెట్టారు. ఓపీటీ విధానం వల్ల ప్రతిభావంతులై స్ధానిక విధ్యార్ధులు తీవ్రం నష్టాపోవాల్సి వస్తుందని కాంగ్రెస్ సభ్యులు వాదిస్తున్నారు. తక్కువ వేతనానికి పనిచేసే విదేశీ విద్యార్ధులనే తమ సంస్ధల్లో తీసుకునేందుకు పలు వ్యాపార సంస్ధలు మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల స్ధానిక పౌరులకు ఉపాధిలేకుండా పోతుండటం పట్ల గతకొంత కాలంగా అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి.

ఓపీటీని తొలగిస్తే అమెరికాలో ఉంటున్న 80వేల మంది భారతీయ విద్యార్ధులకు ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు. అమెరికాకు పై చదువులకోసమని వెళ్ళిన వారిలో చాలా మంది చదువులు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం వెతుక్కోవాలన్న ఆలోచనతో ఉన్నవారే ఎక్కవ. నిజంగా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లు చట్టంగా మారితే ఇకపై చదువు పూర్తయిన మరుక్షణమే అమెరికా దేశం నుండి వెళ్ళి పోవాల్సి ఉంటుంది.

మరోవైపు ఓపీటీని తొలగించటం అంతసాధ్యమయ్యే పనికాదన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది. ఈ బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన వారు రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు. బిల్లు సెనేట్ లో ఆమోదం పొందటం సాధ్యపడేది కాదన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది. ఎప్పటి నుండో ఈ డిమాండ్ ఉన్నప్పటికీ దీనిపై ఏకభిప్రాయానికి రావటం అన్నది కష్టమని నిపుణులు అంటున్నారు.

10TV Telugu News