కెనడా వీధుల్లో భారత ప్రధాని మోదీ ఫ్లెక్సీలు

క‌రోనా వ్యాక్సిన్‌ను పెద్దఎత్తున ఉత్ప‌త్తి చేస్తున్న‌ భార‌త్.. ప‌లు దేశాలకు దాన్ని సరఫరా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భారత్‌కు ఆయా దేశాలు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాయి. ఇటీవ‌లే కెన‌డాకు కూడా వ్యాక్సిన్ పంపింది ఇండియా. దీంతో కెనడాలోని గ్రేట‌ర్ టొరంటోలో భార‌త్‌తో పాటు, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

కెనడా వీధుల్లో భారత ప్రధాని మోదీ ఫ్లెక్సీలు

billboards in Toronto thank PM Narendra Modi: క‌రోనా వ్యాక్సిన్‌ను పెద్దఎత్తున ఉత్ప‌త్తి చేస్తున్న‌ భార‌త్.. ప‌లు దేశాలకు దాన్ని సరఫరా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భారత్‌కు ఆయా దేశాలు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాయి. ఇటీవ‌లే కెన‌డాకు కూడా వ్యాక్సిన్ పంపింది ఇండియా. దీంతో కెనడాలోని గ్రేట‌ర్ టొరంటోలో భార‌త్‌తో పాటు, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఇందులో మోదీ ఫొటో భార‌త్, కెన‌డా జాతీయ జెండాలు ఉన్నాయి. త‌మ దేశానికి వ్యాక్సిన్ ఇచ్చినందుకు భార‌త్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హిందూ ఫోర‌మ్ కెన‌డా ఆధ్వ‌ర్యంలో ఈ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. ఇరు దేశాల మ‌ధ్య ఉన్న స్నేహ‌బంధం చిర‌కాలం కొన‌సాగాలని అందులో ఆకాంక్షించారు.

గతవారం కెనడాకు 5 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను భారత్ పంపింది. ఇప్పటివరకు సుమారు 50 దేశాలకు తాము టీకా పంపినట్టు మోదీ ఆ మధ్య ఇండియా-స్వీడన్ వర్చ్యువల్ మీట్ లో తెలిపారు. రానున్న నెలల్లో మరిన్ని దేశాలకు సప్లయ్ చేస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేయడంలో ప్రపంచంలో పలు దేశాలకు ఇండియా ఆపన్న హస్తమైంది. పాకిస్తాన్ కు కూడా భారత్ కరోనా వ్యాక్సిన్ అందనుంది. ఈ క్రమంలో ఆయా దేశాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారత్ ను ప్రత్యేకంగా ప్రశంసించింది. కొవిడ్ సంక్షోభ సమయంలో చాలా దేశాలకు, ముఖ్యంగా పేద, వర్ధమాన దేశాలకు మీరు వ్యాక్సిన్లను పంపిణీ చేయడం గొప్ప విషయమని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ .. మోదీని, ఇండియాను కొనియాడారు.

కరోనా టీకాల్లో ఏ పేద దేశమూ వెనకబడకుండా అందరికీ సమానంగా పంచాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో), గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యూనైజేషన్ (గావి) కలిసి కొవ్యాక్స్ అనే గ్రూపును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్రూపు నుంచే భారత్ లో తయారైన 4.5 కోట్ల కరోనా వ్యాక్సిన్లు పాక్ కు అందిస్తామని కొవ్యాక్స్ వర్గాలు తెలిపాయి. అందులో 1.6 కోట్ల డోసులు ఈ ఏడాది జూన్ నాటికి పాక్ కు అందుతాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ ను కొవ్యాక్స్ పంపనుంది.

ఇప్పటిదాకా 65 దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేసింది. మొత్తంగా 5.8 కోట్ల డోసులను ఆయా దేశాలకు పంపించింది. అందులో 1.63 కోట్ల డోసులను కొవ్యాక్స్ కింద పంపిణీ చేయగా.. 77 లక్షల డోసులను ఉచితంగా అందించింది. మిగతా 3.38 కోట్ల డోసులను వివిధ దేశాలకు అమ్మింది.