Glenfiddich Biogas : విస్కీ వ్యర్థాలతో బయో గ్యాస్… గ్లెన్‌ఫెడిచ్‌ వినూత్న ప్రయోగం

గ్లెన్ ఫిడిచ్ ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న బయో గ్యాస్ ను తమ సంస్ధ ట్రక్కులకు వినియోగిస్తున్నారు. ప్రతిఏటా గ్లెన్ ఫిడిచ్ కోటి 40లక్షల బాటిళ్ళ సింగిల్ మాల్డ్ విస్కీని విక్రయిస్తుంది.

Glenfiddich Biogas : విస్కీ వ్యర్థాలతో బయో గ్యాస్… గ్లెన్‌ఫెడిచ్‌ వినూత్న ప్రయోగం

Scotch

Glenfiddich Biogas : ప్రముఖ స్కాచ్ విస్కీ తయారీ సంస్ధ గ్లెన్ ఫెడిచ్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. విస్కీ తయారు చేయగా మిగిలిపోయిన వ్యర్ధాలను పునర్వినియోగించి బయో గ్యాస్ తయారీని ప్రారంభించింది. గ్లెన్ ఫిడిచ్ రూపొందించిన బయో గ్యాస్ 95 శాతం మేర కార్బన్ డై అక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తున్నట్లు గుర్తించారు. డీజిల్ , పెట్రోల్ లాంటి శిలాజ ఇంధనాల కంటే వాహనాలకు ఈ బయోగ్యాస్ ఉపయోగకరంగా ఉందని నిర్ధారణకు వచ్చారు.

గ్లెన్ ఫిడిచ్ ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న బయో గ్యాస్ ను తమ సంస్ధ ట్రక్కులకు వినియోగిస్తున్నారు. ప్రతిఏటా గ్లెన్ ఫిడిచ్ కోటి 40లక్షల బాటిళ్ళ సింగిల్ మాల్డ్ విస్కీని విక్రయిస్తుంది. విస్కీ బాటిళ్ళు తయారు చేయగా పెద్ద ఎత్తున వ్యర్ధాలు పోగుబడుతున్నాయి. ఆ మిగిలివున్న వ్యర్ధాల నుండే ప్రస్తుతం గ్లెన్ ఫిడిచ్ బయో గ్యాస్ తయారు చేస్తుంది.

వాస్తవానికి విస్కీ తయారీ తరువాత వచ్చే వ్యర్ధాలను పశువుల హైప్రొటీన్ దాణాగా మార్చేవారు. ద్రవవ్యర్ధాలతో ఇంధనాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఈ బయో గ్యాస్ ఉత్పత్తికి పూనుకుంది. ప్రస్తుతం కంపెనీకి చెందిన కొన్ని ట్రక్కులకు మాత్రమే ఈ బయోగ్యాస్ ను ఇంధనంగా వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో మిగిలిన ట్రక్కుల్లో కొన్ని సాంకేతిక మార్పులు చేసి వాటికి బయో గ్యాస్ ను ఇంధనంగా వినియోగించనున్నారు. ఇందుకోసం స్కాట్లాండ్ లోని డఫ్ టౌన్ డిస్టిలరీలో ప్రత్యేక ఫ్యుయెల్ స్టేషన్ ఏర్పాటు చేశారు.