సైనా బయోపిక్ వస్తోంది..

సైనా బయోపిక్ వస్తోంది..

SAINA: లవ్ స్టోరీలు, మాస్, క్లాస్, డిఫరెంట్ తరహా సినిమాల్లానే బయోపిక్స్‌కి ఆదరణ పెరుగుతోంది.. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా నేపథ్యానికి చెందిన నిజ జీవిత గాధలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ కోవలేనే బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా సైనా పాత్రలో కనిపించనున్న సినిమా ‘సైనా’.. (మార్ దూంగి)..

SAINA

అమోల్ గుప్తా దర్శకత్వంలో.. ఫ్రంట్ ఫూట్ పిక్చర్స్‌తో టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, క్రిష్ణన్‌ కుమార్‌, సుజయ్‌ జైరాజ్‌, రషేష్‌ షా నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే ‘సైనా’ మూవీని థియేటర్లలో విడుదల చెయ్యనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

SAINA

మార్చి 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సైనా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె పాత్రలో కనిపించడానికి సైనా దగ్గర, నిపుణుల దగ్గర బ్యాడ్మింటన్‌లో ట్రైనింగ్ తీసుకుంది పరిణీతి. సినిమా విజయం పట్ల మూవీ టీం కాన్ఫిడెంట్‌గా ఉంది.

SAINA