Munugode Bypoll Counting: మరికొద్ది గంటల్లో బైపోల్ ఫలితం.. గెలుపుపై ఎవరి దీమా వారిదే

మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిల మధ్య పోరు సాగింది.

Munugode Bypoll Counting: మరికొద్ది గంటల్లో బైపోల్ ఫలితం.. గెలుపుపై ఎవరి దీమా వారిదే

Munugodu By Poll

Munugode Bypoll Counting: రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నెల రోజుల ఉత్కంఠకు ఆదివారం మధ్యాహ్నం వరకు తెరపడనుంది. ఉపపోరుకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ గురువారం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో పోలింగ్ (93.13శాతం) జరిగింది. పోలింగ్ శాతం పెరగడంతో గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు.

Munugode Bypoll Counting: మునుగోడు బై‎పోల్ కౌంటింగ్.. లైవ్.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ ల మధ్య పోరు సాగింది. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి తరపున మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతీ గ్రామం, ప్రతీ ఇంటికి వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. మునుగోడులో విజయం సాధిస్తే నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి గురించి ప్రతీ ఓటరుకు వివరించారు. సీఎం కేసీఆర్ సైతం ఓ బహిరంగ సభ ద్వారా టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని, నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకోవటం జరుగుతుందని ప్రజలకు వివరించారు.

Munugode Assembly Bypoll: నేడే మునుగోడు జడ్జిమెంట్.. మరికొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

మరోవైపు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆ పార్టీ శ్రేణులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావటంతో పాటు, స్థానికంగా బలమైన రాజకీయ నేత కావటం, దీనికితోడు రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి గెలుపు నల్లేరుపై నడకేనని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నారు. రాజగోపాల్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ అగ్రనాయకత్వం ప్రచారం నిర్వహించింది. ఇదిలాఉంటే పోలింగ్ రోజు సాయంత్రం 5గంటల తర్వాత భారీగా పోలింగ్ నమోదైంది. చివరి మూడు గంటల్లో ఏకంగా 20శాతం పోలింగ్ నమోదయింది. ఈ సమయంలో పోలైన ఓట్లే అభ్యర్థుల విజయావకాశాలను నిర్దేశిస్తాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చివర్లో పోలైన ఓట్లన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతల్లోని వారివని, అవన్నీ బీజేపీవేనని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, ఆ పార్టీ శ్రేణులు విజయంపై దీమాతో ఉన్నారు.