Bird Flu Spreading: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం, తీవ్రంగా ప్రభావం..??

థానే, పాల్గర్ జిల్లాల్లో ఇటీవల బర్డ్ ఫ్లూ సోకి వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కారణంగా అవి మృతి చెందినట్లు నిర్ధారించారు.

Bird Flu Spreading: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం, తీవ్రంగా ప్రభావం..??

Bird

Bird Flu Spreading: కరోనా కోరల్లో నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న దేశ ప్రజలకు.. బర్డ్ ఫ్లూ రూపంలో మరో గండం ఎదురు అవుతుంది. దేశంలో చాపకింద నీరులా బర్డ్ ఫ్లూ విస్తరించి ఉన్నట్లు మహారాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. ఆ రాష్ట్రంలోని థానే, పాల్గర్ జిల్లాల్లో ఇటీవల బర్డ్ ఫ్లూ సోకి వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన కోళ్ల అవశేషాలను పరీక్షించిన వైద్యాధికారులు.. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కారణంగా అవి మృతి చెందినట్లు నిర్ధారించారు. మొదట థానే జిల్లాలోని వెహ్లోలి గ్రామంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫారంలో 100కు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు గుర్తించిన స్థానిక అధికారులు, విషయాన్నీ జిల్లా పశువైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

Also read: WHO Covid Tests : కోవిడ్ టెస్టులు తగ్గడంపై WHO ఆందోళన.. అలసత్వం వద్దు..!

కోళ్ల మృతిపై సమీక్ష జరుగుతన్న సమయంలోనే పాల్గర్ జిల్లాలోనూ వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో సమస్య తీవ్రతను గుర్తించిన పశుసంవర్ధకశాఖ అధికారులు..విస్తృత పరీక్షలు నిర్వహించారు. ఈ రెండు జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో H5N1 ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తేల్చారు. ఈక్రమంలో మిగతా ప్రాంతాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నట్లు పాల్‌ఘర్‌ జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ ప్రశాంత్‌ కాంబ్లే తెలిపారు.

Also read: Corona Vaccination: దేశంలో 80శాతం మంది వయోజనులకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి

వైరస్ ను గుర్తించిన పౌల్ట్రీ ఫారంల నుంచి కిలోమీటర్ పరిధిలోని ఇతర ఫారంలలోని కోళ్లను వధించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. అధికారుల ఆదేశాలతో ఒక్క థానే జిల్లాలోనే 25,000 కోళ్లను పూడ్చిపెట్టారు యజమానులు. ఇక H5N1 ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ వ్యాప్తిపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. వైరస్ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. ఇంతవరకు కోళ్ల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.

Also read: Child with Leopard: చిరుత పులితో సహా రెండు గంటల పాటు గదిలోనే బాలిక, చివరకు ఏమైంది?