P.V.Narasimha Rao: ఆర్థిక సంస్కరణల పితామహుడు.. జాతి మరువని నేత ‘పీవీ’

పీవీ పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు. పుట్టింది తెలంగాణలోని నేటి హన్మకొండ జిల్లాలో ఉన్న వంగర అనే చిన్న గ్రామంలో. అప్పటి కాంగ్రెస్‌తో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం ద్వారా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. స్వాతంత్ర్యం తర్వాత 1957-77 వరకు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కొనసాగారు.

P.V.Narasimha Rao: ఆర్థిక సంస్కరణల పితామహుడు.. జాతి మరువని నేత ‘పీవీ’

P.v.narasimha Rao (1)

P.V.Narasimha Rao: నూతన సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన నేత, అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు.. పీవీ నరసింహా రావు జయంతి నేడు (జూన్ 28). రాజకీయాలకు దూరంగా ఉందామని నిర్ణయించుకున్న దశలో అనూహ్యంగా ప్రధాని పదవి చేపట్టి, ఆ పదవికి వన్నె తెచ్చిన ఘనుడు పీవీ. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. రాజకీయంగా ఎలాంటి బలమూ లేకుండానే పదవి చేపట్టి, ఐదేళ్లు సురక్షితమైన పాలన అందించడం అంటే మామూలు విషయం కాదు. కానీ, దీన్ని సుసాధ్యం చేసి చూపించారు పీవీ. ఆయన 101వ జయంతి సందర్భంగా పీవీకి సంబంధించిన కొన్ని విశేషాలివి.

PM Modi: మోదీకి జో బైడెన్ ఆత్మీయ పలకరింపు.. జీ-7 సదస్సులో ఆసక్తికర దృశ్యం

పీవీ పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు. పుట్టింది తెలంగాణలోని నేటి హన్మకొండ జిల్లాలో ఉన్న వంగర అనే చిన్న గ్రామంలో. అప్పటి కాంగ్రెస్‌తో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం ద్వారా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. స్వాతంత్ర్యం తర్వాత 1957-77 వరకు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కొనసాగారు. మధ్యలో 1971-1973 వరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈ సమయంలో ల్యాండ్ సీలింగ్ వంటి భూ సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత ఏపీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలు నిర్వహించారు. 1990వ దశకం వచ్చేసరికి రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాతి సంవత్సరం అంటే 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత అనూహ్యంగా ప్రధాని పదవి చేపట్టాల్సి వచ్చింది. రాజకీయంగా ఎలాంటి మద్దతు లేకుండానే ప్రధాని అయిన పీవీ తన బాధ్యతను మాత్రం సక్రమంగా నిర్వర్తించారు. దేశానికి కొత్త దిశ చూపారు. ముఖ్యంగా ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా నిలిచాయి. అందుకే ఆయనను అందరూ ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడి’గా పిలుస్తారు.

P.V.Narasimha Rao: ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మాణం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పీవీ ప్రధాని పదవి చేపట్టేనాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చెల్లింపుల సమస్యలు, ద్రవ్యలోటు, విదేశీ మారక నిల్వల తరుగుదల వంటి ఆర్థిక సమస్యలు వెంటాడాయి. చివరకు విదేశీ దిగుమతులకు డబ్బు చెల్లించే పరిస్థితి కూడా లేని స్థాయికి భారత ఆర్థిక వ్యవస్థ దిగజారింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద బంగారు నిల్వలను తాకట్టుపెట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌తో కలిసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పని చేపట్టారు. పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సరళీకరణల ఫలితంగా దేశం సంక్షోభం నుంచి గట్టెక్కింది. దీంతో కొందరు పీవీని ప్రశంసిస్తే, ఆర్థిక సంస్కరణలను విమర్శించే ఇంకొందరు ఆయనను తప్పబట్టారు. అయితే, పీవీ చేపట్టిన సంస్కరణల ఫలాలే ప్రస్తుతం దేశం అనుభవిస్తోందని నమ్మే ఆర్థిక వేత్తలు ఇప్పటికీ ఉన్నారు.