AAP MP on Ayodhya: బీజేపీకి రాముడిపై నమ్మకం లేదు.. అవినీతిపై ఉంది: ఆప్ ఎంపీ

బీజేపీకి శ్రీ రాముడిపై నమ్మకం లేదని, అవినీతిపై నమ్మకం ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. అయోధ్యలో భూములకు సంబంధించిన అక్రమంగా ఒప్పందాలు చేసుకున్న వ్యవహారంలో అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే, మేయర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే తదితర 40 మంది పేర్లను అయోధ్య అభివృద్ధి అథారిటీ తాజాగా ప్రకటించింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ స్పందిస్తూ... ఇటువంటి అక్రమాలకు పాల్పడినందుకు బీజేపీ సిగ్గుపడుతుందో లేదో కానీ, ఆ పార్టీ నేతలను చూసి ప్రజలు మాత్రం సిగ్గుపడుతున్నారని విమర్శించారు.

AAP MP on Ayodhya: బీజేపీకి రాముడిపై నమ్మకం లేదు.. అవినీతిపై ఉంది: ఆప్ ఎంపీ

AAP MP on Ayodhya: బీజేపీకి శ్రీ రాముడిపై నమ్మకం లేదని, అవినీతిపై నమ్మకం ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. అయోధ్యలో భూములకు సంబంధించిన అక్రమంగా ఒప్పందాలు చేసుకున్న వ్యవహారంలో అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే, మేయర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే తదితర 40 మంది పేర్లను అయోధ్య అభివృద్ధి అథారిటీ తాజాగా ప్రకటించింది. వారు అక్రమంగా అయోధ్యలో క్రయవిక్రయాలు జరపడం, కాలనీలను నిర్మించడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది.

దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ స్పందిస్తూ… ఆ 40 మందిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామ మందిరానికి సమీపంలో అక్రమంగా నిర్మించిన కాలనీలను బుల్డోజర్లతో కూల్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ ఆక్రమించుకున్న భూములను వెంటనే ఖాళీ చేయించాలని అన్నారు. భూ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారన్న విషయంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడినందుకు బీజేపీ సిగ్గుపడుతుందో లేదో కానీ, ఆ పార్టీ నేతలను చూసి ప్రజలు మాత్రం సిగ్గుపడుతున్నారని విమర్శించారు.

‘మీకు రాముడిపై నమ్మకం లేదు.. అవినీతిపై, లంచాలు తీసుకోవడంపై, దోపిడీ చేయడం, భూకుంభకోణాలకు పాల్పడడంపై నమ్మకం ఉంది’ అని ఆయన అన్నారు. అయోధ్యలో భూ కుంభకోణంపై తాను ఏడాది క్రితమే ఆధారాలతో పాటు బయటపెట్టానని, అయితే, అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా తనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెట్టిందని చెప్పారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తరప్రదేశ్ రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జిగా ఎంపీ సంజయ్ సింగ్ ఉన్నారు. అయోధ్యలో అక్రమాలు జరిగాయని గత ఏడాది జూన్ 24న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Arvind Kejriwal to centre: ప్రజలకు ఉచితాలు ప్రకటిస్తే తప్పేంటి?: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్