GVL Comments: బుల్డోజర్స్ ఎత్తితేనే ఏపీలో అవినీతి నిర్మూలన: జీవీఎల్

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పెరిగిపోయిందని, బుల్డోజర్స్‌తో ఎత్తితే కానీ అవినీతి పోదని అభిప్రాయపడ్డారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు. రాబోయే రోజుల్లో బీజేపీ రోడ్‌మ్యాప్‌పై, రాష్ట్ర రాజకీయాలపై పార్టీలో చర్చించామని చెప్పారు.

GVL Comments: బుల్డోజర్స్ ఎత్తితేనే ఏపీలో అవినీతి నిర్మూలన: జీవీఎల్

Gvl Comments

GVL Comments: ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పెరిగిపోయిందని, బుల్డోజర్స్‌తో ఎత్తితే కానీ అవినీతి పోదని అభిప్రాయపడ్డారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు. రాబోయే రోజుల్లో బీజేపీ రోడ్‌మ్యాప్‌పై, రాష్ట్ర రాజకీయాలపై పార్టీలో చర్చించామని చెప్పారు. గురువారం జీవీఎల్ నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.

Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ

‘‘ఏపీలో అభివృద్ధి, సమగ్రాభివృద్ధి అనేదే లేదు. పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. అంబేద్కర్ పేరుని జిల్లాకు పెట్టడంపై కూడా రాజకీయాలు చేస్తున్నారు. అన్ని జిల్లాల పేర్లు ముందుగానే నిర్ణయించిన తర్వాత, పేరు మార్చాల్సిన అవసరం ఏముంది? ఈ విషయంలో చంద్రబాబు తన వైఖరి ఏమిటో చెప్పాలి. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ పేరును చంద్రబాబు సూచించారు. జగన్ పాటించారు. ఇద్దరూ కలిసి ఆడిన నాటకం ఇది. అంబేద్కర్ పేరుని రాజకీయాల్లోకి లాగడం దారుణం. మంత్రి ఇంటిపై దాడి జరిగితే కనీసం ఫైర్ ఇంజిన్ కూడా వెళ్లలేదు. అంటే ప్రభుత్వం ఈ ఘర్షణలను ప్రేరేపించిందా? రెండు పార్టీలు ఈ అంశాన్ని రాజకీయాలకు వాడుకున్నాయి. జగన్, చంద్రబాబు కలిసి ఒకే దారిలో ముందుకెళ్తున్నారు. అవినీతికి కవల పిల్లల్లా టీడీపీ, వైసీపీ ఉన్నాయి. ఈ రెండు అవినీతి పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయి. జనసేనతోనే ముందుకెళ్తాం. వేరే ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు.

Chandrababu Naidu: కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే: చంద్రబాబు

ఉత్తరాంధ్రలో బీజేపీ పర్యటన చేయడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పనులకు నిధులు విడుదల చేసింది. ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుంది. కుటుంబ రాజకీయాలకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకం. అందుకే ఆత్మకూరులో పోటీకి దిగబోతున్నాం. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తాం’’ అని జీవీఎల్ అన్నారు.