Saroornagar Murder: సరూర్‌నగర్‌ పరువు హత్యపై గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

సరూర్‌నగర్‌లో పరువు హత్య రాజకీయ రంగు పులుముకుంటుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దళితులపై దాడులు, హత్యలు జరుగుతున్న తెరాస ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ..

Saroornagar Murder: సరూర్‌నగర్‌ పరువు హత్యపై గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

Saroorngar Crime

Saroornagar Murder: సరూర్‌నగర్‌లో పరువు హత్య రాజకీయ రంగు పులుముకుంటుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దళితులపై దాడులు, హత్యలు జరుగుతున్న తెరాస ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బీజేపీ రాష్ట్ర నాయకులు కలిశారు. ఈ సందర్భంగా హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నాగరాజు కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని గవర్నర్‌కు బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు.

Asaduddin Owaisi: సరూర్‌నగర్ పరువు హత్య ఘటనపై స్పందించిన ఓవైసీ.. నిందితులను..

ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని నడిబొడ్డన పరువు హత్య జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి ప్రాణహాని ఉందని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని మాత్రమే అరెస్టు చేశారని, మరో ఇద్దరిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను వెంటనే శిక్షించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం మధ్యాహ్నం నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

Inter Religion Marriage: మరో దారుణానికి దారితీసిన మతాంతర వివాహం

ఇదిలా ఉంటే సరూర్‌నగర్ పరువు హత్యపై ఇప్పటికే గవర్నర్ తమిళిసై స్పందించారు. కేసుపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు పరువు హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని కాపాడేందుకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నిస్తున్నాడని, టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి మృతుని కుటుంబానికి న్యాయం జరగకుండా చేస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు. దీనిపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ.. సరూర్ నగర్ పరువు హత్య క్షమించరాని నేరమని, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని, అలాంటి వారికి మా మద్దతు ఉండదని వివరించారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.