Asaduddin owaisi: వారిపై పూల వ‌ర్షం.. మా ఇళ్ళ‌పైకి బుల్డోజ‌ర్లు: అస‌దుద్దీన్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల క‌న్వ‌ర్ యాత్ర‌కు వెళ్తున్న భ‌క్తుల‌పై హెలికాప్ట‌ర్ల నుంచి పూల వ‌ర్షం కురిపించిన ఘ‌ట‌న‌పై ఏఐఎంఐఎం అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ''ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌జాధ‌నంతో క‌న్వ‌రియాల‌పై పూల వ‌ర్షం కురిపిస్తోంది. ప్ర‌తి ఒక్క‌రినీ స‌మానంగా చూడాల‌ని మేము బీజేపీని కోరుతున్నాం. మాపై (ముస్లింల‌పై) మాత్రం వారు పూల వ‌ర్షం కురిపించ‌డం లేదు. మా ఇళ్ళ‌పైకి బుల్డోజ‌ర్ల‌ను పంపుతున్నారు'' అని అస‌దుద్దీన్ ఒవైసీ అన్నారు.

Asaduddin owaisi: వారిపై పూల వ‌ర్షం.. మా ఇళ్ళ‌పైకి బుల్డోజ‌ర్లు: అస‌దుద్దీన్

Asaduddin owaisi: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల క‌న్వ‌ర్ యాత్ర‌కు వెళ్తున్న భ‌క్తుల‌పై హెలికాప్ట‌ర్ల నుంచి పూల వ‌ర్షం కురిపించిన ఘ‌ట‌న‌పై ఏఐఎంఐఎం అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ”ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌జాధ‌నంతో క‌న్వ‌రియాల‌పై పూల వ‌ర్షం కురిపిస్తోంది. ప్ర‌తి ఒక్క‌రినీ స‌మానంగా చూడాల‌ని మేము బీజేపీని కోరుతున్నాం. మాపై (ముస్లింల‌పై) మాత్రం వారు పూల వ‌ర్షం కురిపించ‌డం లేదు. మా ఇళ్ళ‌పైకి బుల్డోజ‌ర్ల‌ను పంపుతున్నారు” అని అస‌దుద్దీన్ ఒవైసీ అన్నారు.

కాగా, సోమ‌వారం నుంచి కన్వర్ యాత్ర మొద‌లైంది. శ్రావణ మాస శివరాత్రి సంద‌ర్భంగా నాలుగు రోజుల పాటు ఉత్త‌రాది ప్ర‌జ‌లు కన్వర్ యాత్ర నిర్వహిస్తారు. శివ భక్తులు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొంటారు. విహంగా వీక్షణంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఇటీవల ఈ యాత్ర జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ నేప‌థ్యంలో మొద‌టి రోజు మీర‌ట్ ఐజీ రేంజ్ ప్ర‌వీణ్ కుమార్, డీఎం దీప‌క్ మీనా క‌న్వ‌రియాలపై హెలికాప్ట‌ర్ల నుంచి పూల వ‌ర్షం కురిపించారు. దీనిపై వివాదం చెల‌రేగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఒవైసీ దీనిపై ఇవాళ స్పందించారు.

India vs West Indies: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా