Raghunandan On Agnipath : ప్రభుత్వం గూండాలను పంపి అల్లర్లను ప్రోత్సహిస్తోంది- రఘునందన్ ఫైర్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడికి వేల మంది తరలి వస్తుంటే నిఘా వ్యవస్థ కూడా ఫామ్ హౌజ్ లో నిద్రపోతోందా? సైన్యంలో చేరాలనుకునే యువకులు అల్లర్లకు పాల్పడరు.(Raghunandan On Agnipath)

Raghunandan On Agnipath : ప్రభుత్వం గూండాలను పంపి అల్లర్లను ప్రోత్సహిస్తోంది- రఘునందన్ ఫైర్

Raghunandan On Agnipath : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న విధ్వంసకాండపై తెలంగాణ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ అల్లర్ల వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా కేసీఆర్ సర్కార్ వైఫలమ్యే అని ధ్వజమెత్తుతున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు.

Agnipath : ఆర్మీ జవాన్‌ కావాలని కలలుకన్న యువకుడు ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో మృతి

నిఘా వ్యవస్థ తెలంగాణలో నిద్రపోతోందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడికి వేల మంది తరలి వస్తుంటే నిఘా వ్యవస్థ కూడా ఫామ్ హౌజ్ లో నిద్రపోతోందా? అని ఎమ్మెల్యే రఘునందన్ ప్రశ్నించారు. ఎస్ఐ కాలర్ ని పట్టుకుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికే నిన్నటి రాజ్ భవన్ ముట్టడి అని రఘునందన్ అన్నారు. రాష్ట్ర డీజీపీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద దాడులు చేస్తే నిఘా వ్యవస్థ ఎటు పోయిందన్నారు.

Agnipath : అప్పుడు అన్నదాతలతో.. ఇప్పుడు దేశ జవాన్లతో కేంద్రం ఆడుకుంటోంది : కేటీఆర్

సైన్యంలో చేరాలనుకునే యువకులు అల్లర్లకు పాల్పడరని ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. ప్రభుత్వం గూండాలను పంపి అల్లర్లను ప్రొత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. అగ్నిపథ్ అంశంపై మీద చర్చకు ట్విట్టర్ మంత్రి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. ట్విట్టర్ లో హింసాత్మక ఘటనలు ప్రోత్సహిస్తే మీ అకౌంట్ బ్లాక్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఎమ్మెల్యే రఘునందన్.(Raghunandan On Agnipath)

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఈ విధ్వంసకాండను పసిగట్టడంలో, నిరోధించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. వేలాది మంది స్టేషన్ దగ్గర గుమిగూడుతుంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఆర్మీ అభ్యర్థుల మాటున దుండగులు పెట్రోల్ బాటిళ్లు, ఐరన్ రాడ్లు తీసుకొచ్చి స్టేషన్ లోకి ప్రవేశించినా పోలీస్ వ్యవస్థ ఎందుకు గుర్తించకలేపోయింది? ఇన్ని వేల మంది ఏకధాటిగా దాడి ఎలా చేస్తారు? అన్ని విషయాల్లో ముందస్తుగానే నివేదికలిస్తూ హెచ్చరించే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు? అని బండి సంజయ్ ప్రశ్నలు వర్షం కురిపించారు.

సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని, ఇప్పటికే రద్దు చేసిన ఆర్మీ పరీక్షను తిరిగి పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రైల్వేస్టేషన్ ను ధ్వంసం చేయడంతో పాటు మూడు రైళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో… ఆందోళనకారులు పోలీసులపై రుళ్లు రువ్వారు.

ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడికి ఛాతీలో బుల్లెట్ దిగింది. ఈ యువకుడిని పోలీసులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా… అప్పటికే అతను మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఈ ఆందోళనల్లో 11 మంది యువకులు గాయపడ్డారు. వీరందరికీ గాంధీలో చికిత్స అందిస్తున్నారు.

త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించింది. అయితే, ఈ స్కీమ్ అగ్నిగుండాన్ని రాజేసింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఏడు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.