Narendra Modi : తెలంగాణాలో మోదీ ఫీవర్

హెచ్ఐసీసీ నుంచి పరేడ్ గ్రౌండ్ దాకా.. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి.. రాష్ట్రంలోని చివరి జిల్లా దాకా.. తెలంగాణ మొత్తం మోదీ ఫీవర్‌తో ఊగిపోతోంది.

Narendra Modi : తెలంగాణాలో మోదీ ఫీవర్

Bjp Nattional Executive Meeting Hyderabad

Narendra Modi : హెచ్ఐసీసీ నుంచి పరేడ్ గ్రౌండ్ దాకా.. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి.. రాష్ట్రంలోని చివరి జిల్లా దాకా.. తెలంగాణ మొత్తం మోదీ ఫీవర్‌తో ఊగిపోతోంది. ప్రధాని పర్యటనతో.. భాగ్యనగరం మొత్తం ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయింది. 3 కమిషనరేట్ల పరిధిలో.. ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. మరోవైపు.. మోదీకి స్వాగతం పలికేందుకు.. సిటీ మొత్తాన్ని కాషాయమయంగా మార్చేస్తున్నారు బీజేపీ నేతలు. మరో 3 రోజుల పాటు.. ఈ ఫీవర్ ఇలాగే కంటిన్యూ కానుంది.

రేపు ఎల్లుండి హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. హైటెక్ సిటీలోని.. హైటెక్స్ వేదికగా జరగబోయే ఎన్ఈసీ మీటింగ్‌కు.. ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. దీంతో.. మోదీ హైదరాబాద్ టూర్‌ను.. స్టేట్ బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిటీ మొత్తం.. కాషాయమయంగా మార్చేస్తున్నారు. మెయిన్ సెంటర్లతో పాటు పరేడ్ గ్రౌండ్, హైటెక్ సిటీ, హైటెక్స్, రాజ్ భవన్ చుట్టుపక్కల మొత్తం.. కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. ప్రధాని హైదరాబాద్ టూర్‌ని సక్సెస్ చేసేందుకు, మోదీ దృష్టిలో పడేందుకు.. ఎవరికి వాళ్లు కష్టపడుతున్నారు.

అంతేకాదు.. ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు నగరంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో.. 144 సెక్షన్ కొనసాగుతోంది. దీంతో పాటు బేగంపేట ఎయిర్ పోర్ట్, పరేడ్ గ్రౌండ్, హైటెక్స్, నోవాటెల్ హోటల్, రాజ్ భవన్‌ ఏరియాల్లో.. నో ఫ్లయింగ్ జోన్స్‌ని ప్రకటించారు. ఇక్కడ.. డ్రోన్లు, రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌పై నిషేధం విధించారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారమే.. హైదరాబాద్‌లో ల్యాండ్ కానున్నారు ప్రధాని మోదీ. ఆరోజు.. హైటెక్స్ పక్కనే ఉన్న నోవాటెల్‌లో హోటల్‌లోనే బస చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాదు.. పరేడ్‌గ్రౌండ్‌లో జరగబోయే ప్రధాని మోదీ సభకు.. భారీ స్థాయిలో జనసమీకరణకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే.. అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. కార్యకర్త స్థాయి నుంచి కింది స్థాయి నాయకుల దాకా అంతా.. పరేడ్ గ్రౌండ్‌కు తరలివచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సభలోనే.. ప్రధాని మోదీ.. తెలంగాణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో.. బహిరంగ సభను.. రాష్ట్ర బీజేపీ నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇక.. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని.. ప్రధాని మోదీ దర్శించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమ్మవారికి పూజలు చేసే చాన్స్‌ ఉందన్న సమాచారంతో.. ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. టెంపుల్‌ కమిటీ సభ్యులు.. దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి బీజేపీ కీలక నేతలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. వాళ్లలోనూ కొందరు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారని భావిస్తున్నారు. ఆలయానికి ఎవరొచ్చినా.. స్వాగతం పలికి దర్శనం చేయించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో.. 4 రోజుల పాటు చార్మినార్ ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేయాలని.. పోలీస్ శాఖ నిర్ణయించింది.

Also Read : Single-Use Plastic Ban: నేటి నుంచి ఈ వస్తువులు బ్యాన్.. వాడారో.. ఫెనాల్టీ కట్టాల్సిందే..