BJP questions Rahul: అది సంఘీభావమా, స్టంటా?.. కాంగ్రెస్ నేత కాలర్ పట్టుకోవడంపై రాహుల్‭కు బీజేపీ ప్రశ్న

అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల భారి నుంచి తోటి నాయకుడిని కాపాడేందుకు రాహుల్ గాంధీ అతడి కాలర్ బిగుతుగా పట్టుకోవడం నిన్నటి నిరసనలో హైలైట్‭గా నిలిచింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులంతా దీనికి సంబంధించిన వీడియోను ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ పొగడ్తలు కురిపిస్తున్నారు

BJP questions Rahul: అది సంఘీభావమా, స్టంటా?.. కాంగ్రెస్ నేత కాలర్ పట్టుకోవడంపై రాహుల్‭కు బీజేపీ ప్రశ్న

BJP questions Rahul Gandhi tore Congress leader shirt during protest

BJP questions Rahul: జీఎస్టీ, అధిక ధరలు, నిరుద్యోగంపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన మొత్తానికి హైడ్రామా మధ్య కొనసాగింది. అయితే అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల భారి నుంచి తోటి నాయకుడిని కాపాడేందుకు రాహుల్ గాంధీ అతడి కాలర్ బిగుతుగా పట్టుకోవడం నిన్నటి నిరసనలో హైలైట్‭గా నిలిచింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులంతా దీనికి సంబంధించిన వీడియోను ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ పొగడ్తలు కురిపిస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం దీన్ని స్టంట్ అంటూ విమర్శిస్తోంది. ప్రియాంక భారీకేడ్లను దూకడం, తోటి ఎంపీ కాలర్‭ని రాహుల్ పట్టుకోవడం అంతా రాజకీయ తమాషా అని వ్యాఖ్యానించింది.

బీజేపీ ఐటీ వింగ్ ఇంచార్జ్ అమిత్ మాల్వియా తన ట్విట్టర్‭లో దీపెందర్ హూడా కాలర్‭ను రాహుల్ పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ ‘‘ప్రియాంక వాద్రా హ్యాండ్ మూమెంట్ ట్విస్ట్ తర్వాత ఇక్కడ మరొకటి కనిపించింది. తన సహ ఎంపీ దీపెందర్ హూడా చొక్కాను రాహుల్ చింపేయడంతో నిరసనలో నుంచి గొప్ప చిత్రం వచ్చింది. ఇది చూపించి ఢిల్లీ పోలీసులపై నిందలు వేయవచ్చు, తిట్టొచ్చు కూడా. రాజకీయ తమాషా చేయడంలో గాంధీ కవలలు (రాహుల్, ప్రియాంక) బాగా ఆరితేరిపోయారు’’ అని ట్వీట్ చేశారు.

శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాహుల్ నేతృత్వంలో విజయ్ చౌక్ వద్ద కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసేందుకు వచ్చారు. రాహుల్ పక్కనున్న కాంగ్రెస్ ఎంపీ దీపెందర్ హూడాను పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇంతలో రాహుల్ దీపెందర్‭ను పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు దీపెందర్‭ను తమవైపుకు లాగుతుండడంతో దీపెందర్ కాలర్ గట్టిగా పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేయకుండా కాపాడే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Musk on Tesla: ఒకవేళ నన్ను ఏలియన్స్ కిడ్నాప్ చేసినా..?