BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్

సరిగ్గా 520 రోజుల తర్వాత కుటుంబ, అవినీతి పాలన నుండి తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధించే, మోదీ ఆశీర్వాదాలు ఉన్న ప్రభుత్వం రాబోతోందన్నారు.(BJP Tarun Chugh)

BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
ad

BJP Tarun Chugh : హైదరాబాద్ వేదికగా జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ మాట్లాడారు. 35వేల బూత్ ల నుండి కార్యకర్తలు తెలంగాణలో విజయ సంకల్ప్ తీసుకునేందుకు వస్తున్నారని చెప్పారు. చరిత్రాత్మక బహిరంగ సభ కాబోతోందని, బీజేపీ కోసం విజయయాత్రకు శుభారంభం అవుతుందని తరుణ్ చుగ్ అన్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు ఉంటాయన్నారు. ప్రజల కోసం, పేదల కోసం మోదీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వివరిస్తాం అన్నారు.

BJP Bandi Sanjay : టీఆర్ఎస్‌తో మాకు పోటీ ఏంటీ?: బండి సంజ‌య్‌

మోదీ 2 రోజులు ఇక్కడే ఉంటున్నారన్న తరుణ్ చుగ్.. తెలంగాణ ప్రజలు ప్రధాని మోదీని, బీజేపీని చాలా ఇష్టపడతారని చెప్పారు. ప్రతి అంశంపై ఇక్కడ మీడియాకు వివరిస్తామన్నారు. ఇక్కడ కౌంట్ డౌన్ ప్రారంభించామన్న తరుణ్ చుగ్.. కేసీఆర్ ప్రభుత్వం పదవీ కాలం ఎప్పుడు ముగుస్తుందో అందులో తెలియజేస్తామన్నారు. సరిగ్గా 520 రోజుల తర్వాత కుటుంబ, అవినీతి పాలన నుండి తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు.(BJP Tarun Chugh)

Strong Security: భద్రతా వలయంలో మోదీ పర్యటించే ఏరియాలు.. మెట్రో సేవలు బంద్..

బంగారు తెలంగాణ సాధించే, మోదీ ఆశీర్వాదాలు ఉన్న ప్రభుత్వం రాబోతోందన్నారు. హుజూరాబాద్ లో ఓటర్లు కేసీఆర్ అహంకారం దించారని చెప్పారు. 71 రోజులు బండి సంజయ్ పాదయాత్ర చేశారని, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తరుణ్ చుగ్ అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన మీడియా క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రజలను అడిగితే వారి మూడ్ తెలుస్తుందన్నారు.

”తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల పాత్ర ఉంది. లోక్ సభలో సుష్మా స్వరాజ్ తెలంగాణ కోసం ఇచ్చిన స్పీచ్.. బీజేపీ పోరాటం గురించి తెలుపుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని కేసీఆర్ టీఆర్ఎస్ లోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ లో ఉన్న ఉద్యమకారులు బీజేపీ లో చేరారు. హామీ అమలు చేయని సర్కారుగా టీఆర్ఎస్ మారింది.(BJP Tarun Chugh)

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ప్రభుత్వాన్ని కేసీఆర్ కాదు కవిత, కేటీఆర్, హరీశ్ లు నడిపిస్తున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తాం. మోదీ కలలు సాకారం అయ్యేలా తీసుకునే చర్యలపై చర్చిస్తాం. బీజేపీకి ప్రజలు నుంచి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. అందరినీ కలుపుకుని, అందరి కోసం పని చేసే పార్టీ బీజేపీ. బీజేపీ వేగంగా బలం పుంజుకుంటున్న పార్టీ. ఏం అభివృద్ధి చెందింది? శాంతి భద్రతలు ఎలా ఉంటాయో తెలుస్తుంది? ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం సచివాలయంకు కూడా రావడం లేదు” అని తరుణ్ చుగ్ విమర్శించారు.

Chandrababu Warning : వచ్చేది నేనే.. తప్పుడు అధికారులను వదలను- చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్ లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశం.. బీజేపీలో మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాలపైనా తన ముద్రవేయబోతోంది. జులై 2-3 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం మొత్తం భాగ్యనగరానికి తరలిరానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలతో పాటు ముఖ్యమైన నియామకాలు కూడా చేపట్టనున్నారు. కొవిడ్ తర్వాత జరుగుతున్న తొలి పూర్తి స్థాయి కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణలో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న కమలదళం.. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో పార్టీ విస్తరణకు మార్గం నిర్మించనుంది.