Arvind Kejriwal: ఉచిత విద్యుత్ అడ్డుకునేందుకు బీజేపీ యత్నం.. అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణ

ఢిల్లీలో తమ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.

Arvind Kejriwal: ఉచిత విద్యుత్ అడ్డుకునేందుకు బీజేపీ యత్నం.. అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణ

Arvind Kejriwal: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అయతే, బీజేపీ ప్రయత్నాలు సఫలం కాలేదని కేజ్రీవాల్ అన్నారు.

Invitation To Army: మా పెళ్లికి రండి.. ఇండియన్ ఆర్మీకి ఆహ్వానపత్రిక పంపించిన కేరళ జంట.. ఆర్మీ నుంచి అద్భుత రెస్పాన్స్.. సంతోషంలో వధూవరుడు

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై పలు ఆరోపణలు చేశారు. ‘‘డిసెంబర్ 4న జరగబోయే ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ గెలిస్తే ఆమ్ ఆద్మీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఆగిపోతాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఢిల్లీ ప్రజలకు అందిస్తున్న విద్యుత్‌ను వాళ్లు ఉచితంగా పేర్కొంటున్నారు. మనల్ని భిక్షగాళ్లుగా చూస్తూ, మనకేదో సాయం చేస్తున్నట్లు భావిస్తున్నారు. వాళ్లు ఢిల్లీలో ఉచిత విద్యుత్ ఆపేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో వాళ్లు విజయం సాధించలేకపోయారు. కేజ్రీవాల్ ఉన్నంతకాలం ఉచిత్ విద్యుత్ ఆగిపోదు.

Rajamouli : నా నెక్స్ట్ మూవీ ఇండియానా జోన్స్ లా అడ్వెంచరస్ సినిమా.. ఫుల్ ఖుషీలో మహేష్ ఫ్యాన్స్..

కొన్ని డంపింగ్ యార్డులు పూర్తిగా నిండిపోయాయి. చెత్త, వ్యర్థాల నిర్వహణ బీజేపీ బాధ్యత. కానీ, వాళ్లు విఫలమయ్యారు. ఒక్కసారి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆమ్ ఆద్మీకి అవకాశం ఇవ్వండి. నీళ్లు, విద్యుత్ ఉచితంగా అందిస్తున్నట్లుగానే.. చెత్త నిర్వహణ సమస్యను కూడా పరిష్కరిస్తాం. ఢిల్లీలో, ఢిల్లీ మున్సిపల్ పరిధిలో.. రెండింట్లో ఆప్ అధికారంలో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి’’ అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 250 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.