బంగ్లాదేశ్ అక్రమవలస కార్మికుడైన బీజేపీ కార్యకర్త అరెస్ట్

బంగ్లాదేశ్ అక్రమవలస కార్మికుడైన బీజేపీ కార్యకర్త అరెస్ట్

BJP Worker : బంగ్లాదేశ్ అక్రమ వలసదారుడైన వ్యక్తి.. ముంబైలో బీజేపీ కార్యకర్తగా మారిపోయాడు. అతని గురించి సమాచారం అందించి అధికార ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టం ఇందుకేనా అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. ‘అమిత్ షా (కేంద్ర మంత్రి) బీజేపీ సభ్యుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారా..’ అని సచిన్ సావంత్ ట్వీట్ చేసి వెల్లడించారు.

రూబెల్ షేక్ అనే వ్యక్తి ఫోర్జ్‌డ్ డాక్యుమెంట్లు చూపించి ఇండియాలో ఉంటున్నాడు. ఇతనిపై అక్రమ వలస కార్మికుడైన బంగ్లాదేశ్ దేశస్థుడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం ఆ వ్యక్తి ఫొటో చూసిన బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి నార్త్ ముంబై మైనారిటీ సెల్ చీఫ్ గా గుర్తించారు.

ఈ అవకాశాన్ని వాడుకుంటూ కాంగ్రెస్… బీజేపీపై విమర్శల దాడి చేయడం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలస కార్మికులను అడ్డుకోవడానికి చేసిన చట్టాలు ఏమయ్యాయంటూ ప్రశ్నించింది.

‘నార్త్ ముంబై బీజేపీ మైనారిటీ సెల్ చీఫ్ బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి. మేం బీజేపీని అడగాలనుకుంటున్నాం. ఇదేమైనా జిహాద్ సంఘమా. లేదంటే బీజేపీకి సీఏఏ కింద ఏదైనా ప్రత్యేక చట్టం ఉందా.. ఒకటి దేశం కోసం చట్టం, మరొకటి బీజేపీ కోసమా..’ అని సావంత్ అన్నారు.