CM KCR: బీజేపీ తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్

ఇటీవల ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై విమర్శలు చేశారు. ఈ కొనుగోలుకు సంబంధించిన వీడియోను మీడియాకు విడుదల చేశారు.

CM KCR: బీజేపీ తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్

CM KCR: ఎమ్మ్యేల్యేల కొనుగోలు వ్యవహారంపై వీడియోను దేశంలోని న్యాయమూర్తులందరికీ పంపిస్తానని చెప్పారు సీఎం కేసీఆర్. హైదరాబాద్, ప్రగతి భవన్‌లో గురువారం సాయత్రం ఎనిమిది గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, మునుగోడు ఉప ఎన్నికపై స్పందించారు.

Bridegroom: అత్తింటివారు ఇచ్చిన కారుతో అత్తను ఢీకొట్టి చంపిన అల్లుడు

‘‘తొలిసారిగా భారమైన మనస్సుతో మట్లాడుతున్నా. దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోంది. ఎనిమిదేళ్లలో దేశం సిగ్గుపడేలా బీజేపీ వ్యవహరించింది. దేశాన్ని సర్వనాశనం చేసింది. బీజేపీ చేస్తున్న అరాచకకాండ జుగుప్సాకరంగా ఉంది. రాజకీయ హననాన్ని అడ్డుకోకుంటే దేశ ఉనికికే ప్రమాదం. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై గంట నిడివి ఉంది. దేశాన్ని కాపాడాలంటూ సీజేఐ జస్టిస్ లలిత్, దేశంలోని న్యాయమూర్తులందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నా. దేశంలోని న్యాయమూర్తులందరికీ వీడియో పంపిస్తా. ఒక్కసారి దేశం దెబ్బతిందంటే వందేళ్లు వెనక్కి వెళ్లిపోతుంది. ప్రజాస్వామ్య హత్య, హంతకుల స్త్వైర విహారం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. చాలా మంది చిల్లర నోళ్లు వేసుకుని మాట్లాడుతున్నారు. నీచమైన వ్యక్తులు, రాజకీయాలు తయారయ్యాయి. మునుగోడులో సిగ్గుపడేలా బీజేపీ వ్యవహరించింది. ఓటమినైనా, గెలుపునైనా గంభీరంగా స్వీకరించాలి. బీజేపీని గెలిపిస్తే ఈసీ మంచిది? లేకపోతే చెడ్డదా? ఎన్నికలు వస్తుంటాయి. పోతుంటాయి.

DRDO: భారత రక్షణ వ్యవస్థలో మరో ముందడుగు.. బాలిస్టిక్ మిస్సైల్ రక్షణ వ్యవస్థ ప్రయోగం విజయవంతం

పాల్వాయి స్రవంతి నన్ను కలిసిందని దుష్ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యంలో సంయమనం, సహనం అవసరం. ఇంత దిగజారుడు రాజకీయాలు చూడలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వాళ్లు చాలా ఘోరంగా మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వీడియోను న్యాయ వ్యవస్థలకు, మీడియాకు, రాజ్యాంగ వ్యవస్థలకు, అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపిస్తా. దేశ ప్రజాస్వామ్యంలో ఉన్నవాళ్లు ఈ కుట్రల విషయం తెలుసుకోవాలి. దీన్ని సింగిల్ కేసుగా చూడొద్దని న్యాయవ్యవస్థను కోరుతున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై, యువతపై ఉంది. ప్రధాన మంత్రి పశ్చిమ బెంగాల్‌లో మీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఇలా చెప్పడం ధర్మమా? అహంకారమా? గత నెలలో రామచంద్ర భారతి హైదరాబాద్ వచ్చారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. మొత్తానికి రోహిత్ రెడ్డిని కలిశారు. దీనిపై హోంమంత్రి, పోలీసులకు ఫిర్యాదు చేశారు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.