Manchu Manoj: బ్లాక్ ఫిల్మ్ ఎఫెక్ట్.. మనోజ్ కారును అడ్డుకున్న పోలీసులు!

సినీ స్టార్ల కార్లకు వరసపెట్టి చలాన్లు విధిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. టాఫిక్ చలనాలపై భారీ రాయితీలు ప్రకటించిన హైదరాబాద్ పోలీసులు.. మార్చి 31తో ఈ రాయితీలు ముగియనుండడంతో ముమ్మర..

Manchu Manoj: బ్లాక్ ఫిల్మ్ ఎఫెక్ట్.. మనోజ్ కారును అడ్డుకున్న పోలీసులు!

Manchu Manoj

Manchu Manoj: సినీ స్టార్ల కార్లకు వరసపెట్టి చలాన్లు విధిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. టాఫిక్ చలనాలపై భారీ రాయితీలు ప్రకటించిన హైదరాబాద్ పోలీసులు.. మార్చి 31తో ఈ రాయితీలు ముగియనుండడంతో ముమ్మర తనిఖీలు నిర్వహించి పెండింగ్ చలానాలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందు జూనియర్ ఎన్టీఆర్ కారుతో పాటు మరికొంతమంది ప్రజా ప్రతినిధుల కార్లను సోదాలు నిర్వహించిన జూబ్లీహిల్స్ పోలీసులు అద్దాలకున్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి జరిమానా విధించారు.

Jr NTR: తారక్ కారు ఆపి సోదాలు నిర్వహించిన జూబ్లీహిల్స్ పోలీసులు!

ఆ తర్వాత అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ కార్లకున్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సినీ హీరో మంచు మనోజ్ కారును అడ్డుకున్న హైదరాబాద్ పోలీసులు నిబంధనలకు అనుగుణంగా బ్లాక్ ఫిల్మ్ తొలగించారు. మెహిదీపట్నంలో వాహనాల తనిఖీ నిర్వహించిన టోలిచౌకి ట్రాఫిక్ పోలీసులు అటుగా వెళ్తున్న మంచు మనోజ్ ఏపీ 39HY 0319 కారును ఆపారు. అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో దాన్ని తొలగించి 700 రూపాయల చలాన్ విధించారు. ఆ సమయంలో మంచు మనోజ్ కూడా కారులోనే ఉండగా పోలీసుల విధి నిర్వహణకు సహకరించారని పోలీసులు తెలిపారు.

Allu Arjun: అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ కార్లకు ఫైన్

అయితే.. సెలబ్రిటీలు ఎందుకు ఇలా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు.. బ్లాక్ స్క్రీన్ ఉపయోగించడం చట్టవిరుద్దామా అనే చర్చలు కూడా సహజంగానే వస్తుంటాయి. నిజానికి వై- క్యాటగిరి, జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీ వంటి భద్రత ఉన్న వ్యక్తులకు మాత్రమే బ్లాక్ స్క్రీన్ ఉపయోగించాలని ఇటీవల సుప్రీం కోర్టు కూడా ఆదేశించిన సంగతి తెలిసిందే. సినీ సెలబ్రిటీలు ఇలా బ్లాక్ స్క్రీన్‌ వేసుకోవడం నిబంధనలకు విరుద్దం కిందకే వస్తుంది. అయితే.. అలా బ్లాక్ స్క్రీన్ లేకపోతే ట్రాఫిక్ లో సామాన్య ప్రజలు వాళ్ళను గుర్తుపట్టడంతో అప్పుడప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే వీళ్ళు ఈ విషయంలో రూల్స్ బ్రేక్ చేస్తున్నారు.