Black Fungus: హర్యానాలో బ్లాక్ ఫంగస్ పంజా.. ఒకేరోజు 18 మంది మృతి!

మన దేశంలో బ్లాక్ ఫంగస్ పంజా ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఒకపక్క కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తుంటే.. ఇదే తరుణంలో ఫంగస్‌లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Black Fungus: హర్యానాలో బ్లాక్ ఫంగస్ పంజా.. ఒకేరోజు 18 మంది మృతి!

Black Fungus

Black Fungus: మన దేశంలో బ్లాక్ ఫంగస్ పంజా ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఒకపక్క కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తుంటే.. ఇదే తరుణంలో ఫంగస్‌లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్నామనే సంతోషాన్ని బ్లాక్ ఫంగస్ ఆవిరిచేస్తోంది. కోవిడ్ బారినపడి కోలుకున్న చాలా మందిని ఫంగస్‌లు వేధిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా గుజరాత్‌లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకాగా.. ఆ తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. ఇందులో కొన్ని రాష్ట్రాలలో పరిస్థితి మరింత తీవ్రతరంగా మారుతుంది.

హర్యానాలో శుక్రవారం ఒక్కరోజే 133 కేసులు నమోదవగా 18 రోజు మృత్యువాతపడ్డారు. దీంతో ఇక్కడ బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య 756కు పెరగగా.. ఇప్పటి వరకు 58 మంది రోగులు కోలుకున్నారు. మరో 50 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కాగా.. ఇక్కడ కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ మందుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రానికి 66 లక్షల కరోనా డోసులకు ఆర్డరిస్తే.. ఇందులో ఐదోవంతు రాష్ట్రానికి వచ్చాయి. దీంతో క‌రోనా వ్యాక్సిన్లు, బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతను నివారించేందుకు కోటి కరోనా వ్యాక్సిన్, 15వేల‌ బ్లాక్ ఫంగ‌స్ ఇంజెక్షన్ల కోసం ప్రభుత్వం గ్లోబల్ టెండర్‌ను ఆహ్వానించింది.

మరోవైపు గుజరాత్ సహా.. ఏపీ, కర్ణాటక, తెలంగాణలో కూడా బ్లాక్ ఫంగస్ మందుల కొరత తీవ్రంగా ఉంది. ఒకవైపు ఫంగస్ కేసులు పెరుగుతుండగా మందులు కొందామంటే బ్లాక్ లో కూడా దొరకడం లేదని బాధితుల బంధువులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా బ్లాక్ ఫంగస్ మందుల ఇంజెక్షన్ల కోసం ఆర్డర్ పెట్టగా అవి వచ్చే వారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈలోగా ఆయా రాష్ట్రాలలో బ్లాక్ ఫంగస్ బాధితులు మందుల కోసం వెతలు మన దేశంలో పరిస్థితిని అద్దం పట్టనున్నాయి.