Blade Batch Attacks : లారీ డ్రైవర్‌పై బ్లేడ్ బ్యాచ్ దాడి .. పరిస్థితి విషమం

ఏపీలో మరోసారి బ్లేడ్ బ్యాచ్ దాడులకు తెగబడింది. విజయవాడ రూరల్ మండలం గూడవల్లి వద్ద బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది. ఓ లారీ డ్రైవర్ పై దాడికి తెగబడింది. నిద్రపోతున్న లారీ డ్రైవర్ పై బ్లేడ్ తో దాడి చేసి అతని వద్ద ఉన్న రూ.5,500 నగదు..సెల్ ఫోన్ లాక్కుని పరారయ్యారు. రక్తమోడుతున్న లారీ డ్రైవర్ ను గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

Blade Batch Attacks : లారీ డ్రైవర్‌పై బ్లేడ్ బ్యాచ్ దాడి .. పరిస్థితి విషమం

Blade Batch Attacks :

Blade Batch Attacks : ఏపీలో మరోసారి బ్లేడ్ బ్యాచ్ దాడులకు తెగబడింది. విజయవాడ రూరల్ మండలం గూడవల్లి వద్ద బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది. ఓ లారీ డ్రైవర్ పై దాడికి తెగబడింది. నిద్రపోతున్న లారీ డ్రైవర్ పై బ్లేడ్ తో దాడి చేసి అతని వద్ద ఉన్న రూ.5,500 నగదు..సెల్ ఫోన్ లాక్కుని పరారయ్యారు.రక్తమోడుతున్న లారీ డ్రైవర్ ను గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ వద్ద ఉన్న డబ్బులు లాక్కోవటానికి బ్లేడ్ బ్యాచ్ యత్నించింది. దీంతో డ్రైవర్ ప్రతిఘటించాడు. దీంతో బ్లేడ్ తో దాడి చేసిన నగదు, సెల్ ఫోన్ లాక్కుని పరారయ్యారు బ్లేడ్ బ్యాచ్.

తెలుగు రాష్ట్రాల్లో బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఇళ్లపై దాడిచేసి అడ్డొచ్చిన వారిని బ్లేడ్ తో గాయపర్చి దోపిడీకి పాల్పడే స్థాయినుండి ఇప్పుడు నడిరోడ్డుపై దారిదోపిడీలకు పాల్పడే స్థాయికి ఈ బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు పెరిగాయి. ఈక్రమంలో కర్నూల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన కలీమ్ (42) లారీ డ్రైవర్ పై దాడికి తెగబడింది. కలీమ్ లారీలో లోడ్ తీసుకుని వెళుతూ శుక్రవారం (సెప్టెంబర్ 23,2022) రాత్రి విజయవాడ రూరల్ మండలంలో ఆగాడు. గూడవల్లి జాతీయ రహదారి పక్కన లారీ ఆపి అందులోనే నిద్రించాడు. అయితే అర్ధరాత్రి కలీమ్ గాడనిద్రలో వుండగా బ్లేడ్ బ్యాచ్ దాడికి తెగబడ్డారు. డబ్బులు, సెల్ ఫోన్ ఇవ్వాలని లారీ డ్రైవర్ ను బెదిరించగా అతడు ప్రతిఘటించాడు. దీంతో అతడిపై బ్లేడ్ తో అతి దారుణంగా గాయపర్చి నగదు, సెల్ ఫోన్ ను దొంగిలించారు.

బ్లేడ్ బ్యాచ్ దాడిలో తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో పడిపోయిన కలీమ్ ను గుర్తించిన వాహనదారులు 108 కు సమాచారమిచ్చారు. వెంటనే అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుని కలీమ్ ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.